Srinagar: జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్‌నాగ్ అటవి ప్రాంతంలో భీకరమైన కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ జిల్లా కోకెర్నాగ్ అహ్లాన్ గగర్మండు అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తుండగా అడవిలో దాక్కున్న ఉగ్రవాదులు సెర్చ్ పార్టీలను గమనించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో భద్రతా బలగాలు అటాక్ చేశాయని, దీంతో తీవ్ర కాల్పులకు దారితీసిందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని, గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు జవాన్లు మరణించారని చెప్పారు. ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను తరలించామని, ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Terrorists attack
Amarnath : పవిత్ర గుహకు బయలుదేరిన భక్తులు.. బాం-బం-భోలే నామస్మరణతో మారుమోగుతున్న అమర్నాథ్!
Amarnath Yatra : జమ్మూ అమర్నాథ్ పవిత్ర గుహను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బేస్ క్యాంపు నుంచి బయలుదేరారు. అమర్నాథ్ (Amarnath) పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల సౌకర్యాలపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంది. కొద్ది రోజుల క్రితం శివఖోడి నుంచి తిరిగి వస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు (Terrorists Attack) జరిపారు. ఆ తర్వాత బస్సు కాలువలో బోల్తా పడింది. ఈ దారుణ ఘటనలో 9మంది భక్తులు చనిపోయారు. దీంతో అమర్నాథ్ యాత్రకు ప్రతీసారి కంటే ఎక్కువగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రికులు బాబా భక్తిలో మునిగిపోయారు. తమకు ఎలాంటి భయం, ప్రయాణికులంతా నినదిస్తున్నారు. యాత్రికుల్లో చాలామంది ఏళ్ల తరబడి అమర్నాథ్ యాత్ర చేస్తున్నారు.
#WATCH | J&K: A large number of pilgrims en route from Baltal to Holy Amarnath cave. pic.twitter.com/u9hdwn7c95
— ANI (@ANI) June 29, 2024
బాం-బం భోలే అనే మంత్రోచ్ఛారణలతో భక్తులు శివుడి దర్శనం చేసుకుంటున్నారు. పవిత్ర అమర్నాథ్ గుహను సందర్శించేందుకు మొదటి బ్యాచ్ యాత్రికులు బాల్తాల్ నుంచి బయలుదేరారు. 4,603 మంది భక్తులు మూడు అంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య కశ్మీర్‌కు బయలుదేరారు. అంతకముందు ఖాజిగుండ్‌లోని నవియుగ్ టన్నెల్ మీదుగా బల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపులకు వచ్చారు. ముందుగా ఉధంపూర్‌లోని తిక్రీలోని కాళీమాత ఆలయానికి వెళ్లారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన శివభక్తుల్లో అశేషమైన ఉత్సాహం కనిపిస్తోంది.
ఆ కార్డు తప్పనిసరి:
భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) కార్డ్ తప్పనిసరి. ఇది లేకుండా ప్రయాణీకులెవరూ ముందుకు వెళ్లడానికి అనుమతించరు. బాల్తాల్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఒక్కరోజులో దర్శనం తర్వాత తిరిగి వస్తారు. ఇక చాలా మంది ప్రయాణికులు ఈ మార్గాన్ని ఇష్టపడతారు. ఈసారి 52 రోజుల పాటు యాత్ర సాగనుంది. ఆగస్ట్ 19 వరకు భక్తులు శివుడిని దర్శనం చేసుకోవచ్చు.
Terrorists : జమ్మూలో ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు..
Air Force : జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) లో శనివారం ఎయిర్‌ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి(Terrorists Attack) కి తెగబడ్డారు. ఏకే 47 రైఫిళ్లతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఒక ఎయిర్‌ఫోర్స్ సైనికుడు మరణించగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. శనివారం సాయంతం ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ జరన్‌వాల నుంచీ ఎయిర్ స్టేషన్‌కు తిరిగెళుతుండగా పూంచ్(Poonch) జిల్లాలో ఈ దాడి జరిగింది. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. అందరికీ ఉధంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, ఘటన అనంతరం ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు ఘటన స్థలంలో ఉగ్రవాద ఏరివేత చర్యలు ప్రారంభించారు. భారీ ఎత్తున సెర్చ్ అండ్ కార్డన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రియ రైఫిల్స్ కూడా ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకుంటోంది. ఘటనపై స్పందించిన ఎయిర్‌ఫోర్సు లోతైన దర్యాప్తు చేపడుతున్నామని తెలిపింది. దాడి అనంతరం టెర్రరిస్టులు సమీప అడవిలోకి పారిపోయారని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు, గతేడాది డిసెంబర్ 21న పూంచ్ జిల్లాలోని బుఫ్లియాజ్ ప్రాంతంలో ఆకస్మిక దాడికి తెగబడ్డ బృందమే ఈ దాడిలోనూ పాలుపంచుకుని ఉంటుందని భద్రతాదళాలు అనుమానిస్తున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన ఆర్మీ సిబ్బంది ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Also Read : లోకల్ ట్రైన్ లో మర్డర్.. మద్యం మత్తులో ప్రయాణికుడిని చంపిన యువకులు.. వీడియో వైరల్!
Terror Attack : పూంచ్‌లో ఉగ్ర దాడి.. ఐదుగురు జవాన్లకు సీరియస్!
Poonch : పూంచ్‌లో రెండు భద్రతా వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. సురన్‌కోట్‌లోని సనాయ్ గ్రామం నుంచి ఉగ్రవాదులు(Terrorists) కాల్పులకు పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. భద్రతా దళాలు ఎదురుదాడి చేస్తున్నాయి.
ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ సమీపంలో..
ఈ మేరకు శనివారం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఐదుగురు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు. ఈసంఘటన గురించి సమాచారం అందగానే పోలీసులతోపాటు పెద్ద ఎత్తున బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పూంచ్‌లోని మేధాత్ సబ్ డివిజన్లోని గుర్సాయ్ మూరీలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ సమీపంలో అనుమానిత ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగినట్లు వెల్లడించారు.
Also Read : దారుణం.. టీచర్‌ను తుపాకితో కాల్చి చంపిన విద్యార్థి
మే 25న ఎన్నికలు..
స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ కార్యకలాపాలను ప్రారంభించింది. షాసితార్ సమీపంలోని జనరల్ ఏరియాలోని ఎయిర్ బేస్ లోపల వాహనాలకు భద్రత కల్పించారు. ప్రభుత్వ పాఠశాల సమీపంలో MES, IAF వాహనంపై సాయుధ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. అనంత్‌నాగ్-రాజౌరీ-పూంచ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పూంచ్, పోలింగ్‌ను EC రీషెడ్యూల్ చేసింది. ఇక్కడ మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అంతకుముందు సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సంభావ్య చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో సాంబా సెక్టార్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సిబ్బందిని హై అలర్ట్ చేశారు.
ఇదిలావుంటే.. బుధవారం తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దులోని బీఎస్ఎఫ్(BSF) కంచెల వద్దకు చొరబడేందుకు ప్రయత్నించిన చొరబాటుదారుని బలగాలు కాల్చి చంపాయి. మే 1, 2 రాత్రి సమయంలో అప్రమత్తమైన BSF దళాలు సాంబా సరిహద్దు ప్రాంతంలో IB గుండా అనుమానాస్పద కదలికను గమనించాయి. ఒక చొరబాటుదారుడు BSF కంచె వైపు వస్తున్నట్లు గమనించి అప్రమత్తమైన దళాలు ఒక చొరబాటుదారుని అడ్డుకున్నట్లు సరిహద్దు భద్రతా దళాలు అధికారిక ప్రకటనలో తెలిపాయి.