Puspa 2 Poster – First Single: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో సినిమా ప్రేమికులు విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’. బన్నీ కెరీర్ లో కీలకంగా నిలిచిన పుష్ప ది రైజ్ కి సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. సినిమాలు ట్రెండ్ కావడం.. మీమ్స్ వైరల్ కావడం.. పాటలు యూట్యూబ్ లో దుమ్ము లేపడం చాలా సహజమైన విషయం. కానీ, చిన్న పోస్టర్ వస్తే చాలు దానిని చూసి లక్షలాది మంది మురిసిపోవడం.. షేర్ చేసుకోవడం పుష్ప 2 సృష్టిస్తున్న ప్రభంజనం. ఇప్పటికే విడుదలైన రెండు పోస్టర్స్ ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజగా పుష్ప 2 నుంచి ఒక సూపర్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈరోజు అంటే మే 1 తేదీ సాయంత్రం పుష్ప.. పుష్ప.. అంటూ సాగే సాంగ్ రిలీజ్ కాబోతోంది. దానికి ఇంట్రోగా అల్లుఅర్జున్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ఎర్ర చందనం దుంగల మధ్య ఎర్రటి కారునుంచి ఎర్రటి షర్ట్ .. నల్ల ఫాంట్ తో స్టైలిష్ గా నడుస్తూ వస్తున్న అల్లు అర్జున్ లుక్ అదిరిపోయింది. పుష్ప స్టయిల్ అంటే ఇదే అన్నట్టుగా ఉన్న బన్నీ లుక్స్ చూస్తే అభిమానులు పిచ్చెక్కి పోవడం ఖాయం అన్నట్టు ఉంది. జస్ట్ పోస్టర్ ఇంత స్టైలిష్ గా ఉంటే, సాయంత్రం రాబోయే పాట ఇంకెంత స్టైలిష్ గా ఉంటుందో అనిపిస్తోంది.
Also Read: వెండితెరపై హీరో కృష్ణ సాహస సంతకం అల్లూరి సీతారామరాజు
పుష్ప 1 ని మించి పుష్ప 2 రూపుదిద్దుకుంటోంది అని అందరూ అంచనాలు వేస్తున్నారు. అల్లు అర్జున్ పోస్టర్స్ ఇప్పటికే జనానికి పిచ్చి ఎక్కిస్తున్నాయి. 2021లో పుష్ప రిలీజ్ అయింది. ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతూ పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించింది. దానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప ది రూల్ ఇప్పుడు సౌత్..నార్త్ తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను రూల్ చేసేస్తుందని అభిమానులు అంటున్నారు. ఆగస్టు 15న విడుదల కానున్న ఈసినిమాకి సంబంధించిన టీజర్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల కానుంది. ఈలోపు పోస్టర్స్ (Puspa 2 Poster).. పాటలతో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వంలో దేవీశ్రీప్రసాద్ సంగీతంతో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్. సమంత కూడా ఒక ప్రత్యేక పాటలో కనిపించే అవకాశం ఉంది. అలాగే సంజయ్ దత్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు.
ఈ ట్వీట్ లో ఆ పోస్టర్ మీరూ చూసేయండి..
India’s Mass Sensation PUSHPA RAJ is here ❤🔥
Let’s welcome him with the blockbuster chant – #PushpaPushpa 🔥🔥#Pushpa2FirstSingle firing today at 5.04 PM in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam & Bengali ❤️🔥
A Rockstar @ThisIsDSP Musical 🎵#Pushpa2TheRule Grand… pic.twitter.com/fu769PkgD6
— Mythri Movie Makers (@MythriOfficial) May 1, 2024