Telangana Job Calendar: ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రూప్-1: ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాగా.. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు షెడ్యూల్ అయినట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు.
గ్రూప్-3: డిసెంబర్-2022 లో ఈ నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
ల్యాబ్ టెక్నీషియన్/నర్సింగ్ ఆఫీసర్/ఫార్మసిస్ట్: ఈ ఉద్యోగాలకు సంబంధించి సెప్టెంబర్ లో నోటిఫికేషన్ వస్తుందని, నవంబర్ లో పరీక్షలు నిర్వహిస్తామని జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు.
గ్రూప్-2: డిసెంబర్-2022లో నోటిఫికేషన్ విడుదల కాగా.. డిసెంబర్-2024లో పరీక్షలు నిర్వహించనున్నారు.
విద్యుత్ శాఖలో ఇంజనీర్: ఈ ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్-2024లో నోటిఫికేషన్లను విడుదల చేస్తామని.. జనవరి-25లో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.
గెజిటెడ్ కేటగిరీ-ఇంజనీర్ సర్వీస్: ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్-2024లో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో పరీక్ష నిర్వహించనున్నారు.
TET: నోటిఫికేషన్ నవంబర్ లో విడుదల చేసి పరీక్షను జనవరిలో నిర్వహిస్తారు.
గ్రూప్-1: ఈ నోటిఫికేషన్ ను అక్టోబర్ లో విడుదల చేసి ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు.
డీఎస్సీ: ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరి-2025లో విడుదల చేసి ఏప్రిల్-2025 న పరీక్షను నిర్వహించనున్నారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్: నోటిఫికేషన్ ను ఫిబ్రవరి-2025న విడుదల చేసి మే-2025లో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
టెట్: నోటిఫికేషన్ ను ఏప్రిల్-2025న విడుదల చేసి జూన్-2025న విడుదల చేయనున్నారు.
ఎస్ఐ: ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్-2025న విడుదల చేసి ఆగస్టులో పరీక్ష నిర్వహిస్తారు.
కానిస్టేబుల్: ఈ నోటిఫికేషన్ సైతం ఏప్రిల్ లో విడుదల చేసి.. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు.
డిగ్రీ కాలేజీల్లో అకాడమిక్ పోస్టులు: ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్-2025లో విడుదల చేసి సెప్టెంబర్ లో పరీక్ష నిర్వహిస్తారు.
💥Telangana Job Calendar 2024-25💥
1. Group I Mains: Oct 21-27, 2024 (Notified: Feb 2024)
2. Group III Services: Nov 17-18, 2024 (Notified: Dec 2022)
3. Lab Tech/Nurse/Pharmacist: Nov 2024 (Notified: Sep 2024)
4. Group II Services: Dec 2024 (Notified: Dec 2022)
5. Engg Posts… pic.twitter.com/jC7BTi4Bt6
— Bolgam Srinivas (@BolgamReports) August 2, 2024
డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు: జూన్-2025న నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ లో పరీక్ష నిర్వహిస్తారు.
గ్రూప్-2: ఈ నోటిఫికేషన్ ను మే-2025లో విడుదల చేసి అదే ఏడాది అక్టోబర్ లో పరీక్ష నిర్వహిస్తారు.
గ్రూప్-3: నోటిఫికేషన్ ను జులై-2025లో విడుదల చేసి.. నవంబర్-2025లో పరీక్ష నిర్వహిస్తారు.