Highest Tax Payer Player: టీమ్ ఇండియా స్టార్ క్రికెట్లు విరాట్ కోహ్లీ ఈ ఏడాది అత్యధికంగా పన్ను చెల్లించిన క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించాడు. రూ.66 కోట్లు ట్యాక్స్ పే చేసి…క్రీడాకారుల్లో టాప్ వన్ నిలిచాడు. ప్రస్తుతం ఇతని ఆస్తుల విలువ రూ.1000కోట్ల కంటే ఎక్కువ అని చెబుతున్నారు. బీసీసీఐ తో చేసుకున్న ఏ+ కాంట్రాక్ట్ ద్వారానే కోహ్లీ ఏడాదికి ఏడు కోట్లు సంపాదిస్తాడు. దాని తర్వాత మ్యాచ్ ఫీజుల రూపంలో కూడా భారీగానే ఆదాయం వస్తుంది. ఐపీఎల్ లో ఆర్సీబీ జట్టు తరుఫున ఆడుతున్నందుకు విరాట్ ఏడాదికి రూ.15 కోట్లు తీసుకుంటాడు. వీటన్నింటితో పాటూ యాడ్స్ కూడా చేస్తాడు. ఒక్కో యాడ్‌కు రూ.7.5 నుంచి 10 కోట్లు ఛార్జ్ చేస్తాడు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా కోట్లు వస్తాయి విరాట్ కోహ్లీకి.
కోహ్లీ తర్వాత మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ రూ.38 కోట్లు, సచిన్ టెండూల్కర్ రూ.28 కోట్లు, సౌరభ్ గంగూలీ రూ.23 కోట్లు పన్ను చెల్లించి కోహ్లీ తర్వాతి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రూ.13 కోట్లు పన్నుగా చెల్లించాడని ఫార్చ్యున్ ఇండియా తెలిపింది. ఇండియాలో అత్యధిక పన్నులు చెల్లించిన వారి లిస్ట్‌ను వెలువరించింది. నటుల్లో తమిళ దళపతి విజయ్ రూ.80 కోట్లు పన్ను చెల్లించారని నివేదికలో తెలిపింది.