Raghu Rama Krishnam Raju: నరసాపురం పార్లమెంట్ టికెట్ ఎన్డీయే కూటమి తరపున సీటు నాదే అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. రెండున్నర ఏళ్లనుంచి చెప్తున్న కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తాని..ఆయా పార్టీల అధినేతల సమక్షంలో కూడా ఎన్నో సార్లు చెప్పాను. నన్ను తాత్కాళికంగా మాత్రమే ఆపగలిగారు…రెండుమూడు రోజుల్లో నా పోటీపై స్పష్టత వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ఆర్ఆర్. ప్రశ్నించే గొంతుకను ఎందుకు ఆపుతున్నారని ప్రజలంతా ప్రశ్నిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు సన్నిహితుడు, బంధువని తెలిపారు. జగన్ చేస్తున్న అవినీతిపై నేను చేస్తున్న పోరాటంలో ప్రతిపక్షాలు చేసిన ఒక వంతుకూడా ఉండదన్నారు. జగన్ అరాచకలాపై సుప్రీంకోర్టులు ఎన్నో కేసులు వేశానని..హైకోర్టులోనూ వేశానని..ఏ నాయకుడైనా ఇన్ని కేసుల వేశాడా అంటూ ప్రశ్నించారు. తనకు టికెట్ రాకున్నా జగన్ ను విమర్శిస్తూనే ఉంటానని..ప్రజలకు ప్రశ్నించే ఒక గొంతు కావాలని ఆ గొంతు తాను అవుతానంటూ రఘురామ కృష్ణంరాజు ఆర్టీవీతో ఇచ్చిన ఎక్స్లూజివ్ ఇంటర్వ్యూ ఈ వీడియోలో పూర్తిగా చూడండి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు