Kollywood Actor SJ Surya : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందుతున్న హైలీ ఎంటర్టైనర్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను ఎస్జే సూర్య వెల్లడించారు.
సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఎస్జే సూర్య, నాని పాత్ర గురించి మాట్లాడుతూ..” నాని పాత్ర చిన్నప్పటి నుంచి కోపం వచ్చే సమస్యతో బాధపడుతుంది. అతని అమ్మ ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి నానికి ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్లాన్ సెట్ చేస్తుంది. అయితే శనివారానికి మాత్రం నాని మినహాయింపు తీసుకుంటాడు. మరి శనివారం ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చేసుకుంటాయనే నేపథ్యంలో ‘సరిపోదా శనివారం’ కాన్సెప్ట్‌తో సాగుతుంది. దాంతో పాటూ ఓ ట్విస్ట్ కూడా ఉంటుంది” అని చెప్పారు.
Also Read : అక్కినేని నాగచైతన్య- శోభిత దూళిపాళ నిశ్చితార్థం-live
ఈ కామెంట్స్ తో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్ తో సినిమా రాలేదని, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ నెట్టింట వరుస పోస్టులు పెడుతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29 న రిలీజ్ కానుంది.