Sarangapani Jathakam: టాలీవుడ్ నటుడు ప్రియదర్శికి ‘బలగం’ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. వేణు యేల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అనేక అవార్డులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ‘బలగం’తో నటుడిగా మరింత పాపులరైన ప్రియదర్శికి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ముందుకెళ్తున్నాడు. ఇటీవలే రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నందకిషోర్ దర్శకత్వంలో ’35 చిన్న కథ కాదు’, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
అనగనగా… ఓ అదృష్ట రేఖ 🤩
అదిగో మా సారంగపాణి 🖐😃Here’s the FIRST LOOK of jam-packed comedy ride #SarangapaniJathakam 🖐🏻@krishnasivalenk #MohanKrishnaIndraganti @PriyadarshiPN pic.twitter.com/jLuSky9QXn
— Vamsi Kaka (@vamsikaka) August 25, 2024
‘సారంగపాణి జాతకం’
అయితే నేడు ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు. అలాగే సినిమాలో ప్రియదర్శి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘సారంగపాణి జాతకం’ ఫిక్స్ చేసినట్లు ప్రకటించారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ప్రియదర్శి జాతకాలు చెప్పే పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థమవుతుంది. అంతేకాదు ‘సారంగపాణి జాతకం’ పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించగా.. వెన్నెల కిషోర్, వైవా హర్ష, VK నరేష్, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు
Also Read: Actor Siddique: సీనియర్ నటుడు సిద్ధిఖీ పై లైంగిక ఆరోపణలు.. కీలక పదవికి రాజీనామా! – Rtvlive.com