కొంతకాలంగా తనతో సన్నిహితంగా ఉంటున్న బాలుడు మరొకరితో క్లోజ్ గా ఉండటం తట్టుకోలేక ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కొన్నాళ్లపాటు వారిద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగుతుండగా ఇంటర్ చదువుతున్న బాలుడు ఆ యవకుడినుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఈర్ష్య పెంచుకున్న యువకుడు లైంగిక దాడి చేసి క్రూరంగా హతమార్చిన ఘటన గుజరాత్ లో సంచలనం రేపింది.
ఈ మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత బాలుడు శుక్రవారం రాత్రి ఇంటికి రాకపోవడం, ఫోన్ కూడా స్విచాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆ బాలుడు నిందితుడు, అతడి స్నేహితుడితో కనిపించినట్లు స్థానికులు తెలిపారు. దాంతో, పోలీసులు నిందితుడు, అతడి స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నేరం ఒప్పుకున్న నిందితులు, జామ్ నగర్ – కళావద్ హైవే సమీపంలో నేరం జరిగిన ప్రదేశం వద్దకు పోలీసులను తీసుకువెళ్లారు. అక్కడ సగం కాలిన స్థితిలో ఉన్న ఆ బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు, స్థానికంగా 11వ తరగతి చదువుతున్న బాధిత బాలుడు ఒకే ప్రాంతంలో నివసించేవారు. వారి కుటుంబాలు కూడా కొన్ని సంవత్సరాలుగా స్నేహంగా ఉంటున్నాయి.
Also read :నా దృష్టిలో అది తప్పు.. కానీ నేటి తరానికి చాలా అవసరం: త్రివిక్రమ్
ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య శారీరక సంబంధం (same-sex relationship) ఏర్పడింది. కొన్నాళ్లుగా ఆ బాలుడు ఈ సంబంధాన్ని వ్యతిరేకిస్తుండడంతో పాటు, వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉండడం గమనించిన నిందిత యువకుడు ఈర్ష్యతో ఆ బాలుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడి సహకారంతో శుక్రవారం రాత్రి ఆ బాలుడిని హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టడానికి వారిరువురూ ప్రయత్నించారు. చనిపోవడానికి ముందు ఆ బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తేలింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వెల్లిడించారు.