Hero Srikanth Son Roshan : సీనియర్ నటుడు శ్రీకాంత్(Srikanth) తనయుడు రోషన్(Roshan) ‘పెళ్లి సందD’ సినిమాతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు(K Raghavendra Rao) రోషన్ ని పరిచయం చేసే బాధ్యతని తీసుకున్నారు. ఆసక్తికరం ఏంటంటే అదే సినిమా పేరుతో 1996లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రోహన్ తండ్రి శ్రీకాంత్ కథానాయకుడిగా చేసిన సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి ‘పెళ్ళిసందడి’ సినిమాకి అశ్విని దత్, అల్లు అరవింద్ లు నిర్మాతలుగా వ్యవహరించారు.
ఇప్పటి ‘పెళ్ళిసందడి’ రోషన్ కి ఒక మంచి బ్రేక్ ఇవ్వకపోయినా, కథానాయకుడిగా నూటికి నూరుశాతం మార్కులని మాత్రం తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత రోషన్ ఒక పాన్ ఇండియా మూవీ(PAN India Movie) లో కూడా చేస్తున్నాడు, అందులో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంటే, మోహన్ లాల్ కుమారుడిగా రోషన్ కనిపించనున్నాడు అని అంటున్నారు.ఈ సినిమా ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. నందకిషోర్ దర్శకుడు, ఇందులో చాలామంది పాన్ ఇండియన్ నటులు నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత రోషన్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఒక సినిమా చేస్తోందని వినపడుతోంది. అయితే ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రకటించారు, కానీ చిత్రీకరణ మొదలెట్టలేదు. ఈ సినిమాతో ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా పేరు ‘ఛాంపియన్'(Champion) అని పెట్టారని తెలిసింది. ప్రకటన వచ్చి చాలా రోజులు అయింది కానీ, ఎప్పుడు చిత్రీకరణ మొదలెడతారు అనే విషయంపై క్లారిటీ లేదు.
View this post on Instagram
Also Read : పవన్ అభిమానుల మనస్సు దోచిన పుష్పరాజ్.. ఫస్ట్ సాంగ్ లో ఇది గమనించారా?
ఇప్పుడు వైజయంతీ మూవీస్ సంస్థ ‘కల్కి 2898 ఏడి’ అనే సినిమాని విడుదల చేస్తున్నారు. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో, ఆ సినిమా విడుదలైన తరువాత రోషన్ తో ‘ఛాంపియన్’ సినిమా చిత్రీకరణ మొదలెట్టవచ్చు అని తెలిసింది.