Ritu Varma: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రి వెడ్డింగ్ పార్టీలో మరో మెగా కోడలు తళుక్కుమందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. పెళ్లిచూపులు, టక్ జగదీష్ లాంటి మూవీలతో ఫేమస్ అయిన హీరోయిన్ రీతూ వర్మ.. నిజంగా మరో మెగా కోడలు కానుందా అనే అనుమానులు వ్యక్తం అవుతున్నాయి.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ పార్టీకి వరుణ్, లావణ్యతో పాటు మెగా యూత్ మొత్తం వచ్చింది. అంతవరకు బానే ఉంది. కాని కొన్ని ఫ్రేముల్లో రీతూవర్మ కూడా కనిపించింది. దీంతో నెటిజన్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. మరో మెగా కోడలు అంటు ట్రోల్స్ చేస్తున్నారు.
హీరోయిన్ రీతూవర్మ ఇంత వరకు మెగా హీరోలతో ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో నితిన్ తన వైఫ్‌తో పాటు వచ్చాడంటే, వరుణ్ ఫ్రెండ్ కాబట్టి వచ్చాడనుకోవచ్చు. మరి రీతూ వర్మ ఈ పార్టీకి ఎందుకు వచ్చింది. తను కూడా లావణ్య ప్రెండ్‌గా వచ్చిందా..? అంటే వాళ్లిద్దరికీ స్నేహం ఉన్నట్టు ఇంత వరకు ఎక్కడా చిన్న వార్త కూడా లేదు. సరే స్నేహం ఉంటే ఉండొచ్చు. కానీ, ఎక్స్‌క్లూజివ్ పార్టీలో మెగా వారసులతో రీతూ వర్మ దిగిన ఫోటో చూసి తను మరో లావణ్య త్రిపాఠి అంటున్నారు.
Also Read: హైదరాబాద్ కు ఐకాన్ స్టార్..జాతీయ ఉత్తమ నటుడుకి ఘన స్వాగతం..!!
ఎందుకంటే, లావణ్య త్రిపాఠి కూడా వరుణ్ తేజ్ తన ప్రేమ వ్యవహారం తేల్చకముందు మెగా ఈవెంట్లు, మెగా హీరోల ఇంట్లో జరిగే ఫంక్షన్లలో సందడి చేసింది.ఇప్పుడు రీతూ వర్మ కూడా అలానే సందడి చేయటంతో మరో మెగా కోడలంటున్నారు. ఐతే మెగా హీరోల్లో బ్యాచిలర్స్ అంటే, సాయితేజ్, వైష్ణవ్ తేజ్, శిరీషే మిగిలారు. వీళ్లలో రీతూ వర్మ ఎవరి గాల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఆన్సర్ లేదు.