Cast Your Vote Take Offers : ఓటు ప్రతీ వారి హక్కు. ఇది వినియోగించుకోవడం ఎంతో అవసరం. అందుకే దీని మీద మరింత అవగాహన కలిగించేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు నేషనల్ ఫుడ్ అథారిటీ ఆఫ్ ఇండియా(National Food Authority Of India) ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఓటేసి చేతి మీద ఇంక్ మార్క్ చూపిస్తే ఉచితంగా ఫుడ్, బీర్ ఇస్తామని ప్రకటించింది. ఓటేసిన తర్వాత రెస్టారెంట్లలో 20 శాతం వరకు డిస్కోంట్ పొందండి చెబుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ ఆఫర్ గౌతమ్ బుద్ధ నగర్, బెంగళూరు(Bangalore) లోని రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. గ్రేటర్ నోయిడా, నోయిడా రెస్టారెంట్ల యజమానులు కూడా ఓటర్లకు రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. పైగా దీనికి డెమోక్రటిక్ ఆఫర్ అని పేరు పెట్టారు. నేషనల్ రెస్టారెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గౌతమ్ బుద్ధ నగర్ ఓటు వేసిన వారికి ఆహారం, మందుపై 20 శాతం తగ్గింపును అందిస్తుంది.
ఈసారి లోక్‌సభ ఎన్నిక(Lok Sabha Elections) ల పోలింగ్ దేశంలో ఏడు దశల్లో జరగుతోంది. మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశ పోలింగ్ ఈరోజు కొనసాగుతోంది. అయితే మొదటి దశ పోలింగ్ అనుకున్నంత స్థాయిలో అవ్వలేదు. అందుకే ఈ కారణంగానే ఓటర్లను ఉత్సాహపరిచేందుకు, వాళ్ళను ఓటు వేసే దిశగా ప్రేరేపించేందుకు నేషనల్ రెస్టారెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఆఫర్ నిర్ణయాన్ని తీసుకుందని…ఛైర్మన్ వరుణ్ ఖేడా చెప్పారు. అలాగే తొలిసారి ఓటు వేయడానికి వెళ్లే యువత కూడా ఈ ఆఫర్‌కు ఆకర్షితులవుతారని అంటున్నారు.
ఇక గ్రేటర్ నోయిడా(Greater Noida) లో చాలా రెస్టారంట్లలోనే ఆఫనర్లు నడుస్తున్నాయి. ఓటేసి వస్తే డిస్కౌంట్లు , కొన్ని చోట్ల ఫ్రీ ఆఫర్లు కూడా ఇస్తున్నారు. నోయిడాలోని ఈ రెస్టారెంట్లలో డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
* డి వాలెంటినో కేఫ్
* నోయిడా సోషల్
* గెటాఫిక్స్
* ఓస్టెరియా
* చికా లోకా
* ఎఫ్ బార్ నోయిడా
* జీరో కోర్ట్ యార్డ్ గార్డెన్స్ గ్యాలెరియా
* డర్టీ రాబిట్
* బేబీ డ్రాగన్
* ట్రిప్పీ టేకిలా
* కేఫ్ ఢిల్లీ హైట్స్
* చింగ్ సింగ్
* పాసో నోయిడా
* మోయిర్ కేఫ్ & లాంజ్
* బీర్ కేఫ్
* పాటియాలా కిచెన్
వీటితో పాటూ ఢిల్లీలోని సన్నీ లఇయోన్ రెస్టారెంట్ చికా లోకా రెస్టారెంట్లో కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇక్కడ కేవలం చేతి మీద ఇంక్ గుర్తు చూపిస్తే చాలు ఆఫర్‌ను పొందవచ్చును. ఇక బెంగళూరులోని డెక్ ఆఫ్ బ్రూస్, రెస్టో-పబ్‌లలో ఇవాళే కాదు 27, 28 తేదీలలో కూడా ఓటర్లకు ఉచిత బీర్, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. దాంతో పాటూ టాక్సీ సర్వీస్ ప్రొవైడర్ రాపిడో బెంగళూరులో వికలాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్ల కోసం ఆటో క్యాబ్‌లు, బైక్ రైడ్లను అందజేస్తుంది.
Also Read:Elections 2024: కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు