RRR Interchanges: రీజినల్ రింగ్ రోడ్డుతో జిల్లాలను మధ్య ప్రయాణాన్ని ఈజీ చేస్తున్నారు. ఈ రింగ్ రోడ్డులపైకి వెళ్ళడానికి.. దిగడానికి వీలుగా రెండు భారీ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తున్నారు. హైదరాబాద్ – పూణే నేషనల్ హైవే క్రాస్ చేసే సంగారెడ్డి దగ్గరలోని గిర్మాపూర్ దగ్గర ఈ ఇంటర్ఛేంజ్వస్తుంది. ఇంకోటి హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేని క్రాస్ చేస్తూ చౌటుప్పల్ వద్ద వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ‘ఎక్స్టెండెడ్ డంబెల్’ డిజైన్ ను ఎంపిక చేశారు. ఇటువంటి డిజైన్ ను ఢిల్లీ లోని ఔటర్ రింగ్ రోడ్డుపై వినియోగించారు. అదే డిజైన్ ఇక్కడా ఉపయోగించాలని భావిస్తున్నారు.
RRR Interchanges: నిజానికి ఈ ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించాలంటే చాలా భూమి అవసరం అవుతుంది. ఎందుకంటే.. రింగ్ రోడ్డు నుంచి రింగు రోడ్డుకు హైవేలను దాటాలంటే చుట్టూ తిరిగి వచ్చే విధంగా రోడ్డును నిర్మించాలి. అలా కాకుండా హైవే నుంచి నేరుగా రింగ్ రోడ్డు పైకి వెళ్లేలా.. అదేవిధంగా రింగురోడ్డు నుంచి నేరుగా హైవేలలో కలిసేలా ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, లూప్ విధానంలో ఇలా ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మిస్తే ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే భూసేకరణ పెద్ద సమస్య. అందుకే ఎక్స్టెండెడ్ డంబెల్ డిజైన్ ద్వారా ఈ నిర్మాణాలను చేయాలని భావిస్తున్నారు. ఈ విధానంలో అవసరమైన భూమిలో 70 శాతం వరకూ రింగ్ రోడ్డు భూమితో కలిసి ఉంటుంది. అందువల్ల కేవలం 30 శాతం భూమిని సేకరిస్తే సరిపోతుంది.
ఆ డిజైన్ ఎందుకు?
RRR Interchanges: ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం ఉన్న రోడ్లను దాటే ప్రాంతాల్లో ఆ రోడ్ల నుంచి రింగ్ రోడ్డుకు, రింగ్ రోడ్డు నుంచి ఆ రోడ్లకు వాహనాలు సులభంగా వెళ్లేందుకు ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు. ఆ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా సర్క్యూట్ డిజైన్లను ఎంపిక చేస్తారు. ఉత్తర-దక్షిణ భాగాలు కలిసే సంగారెడ్డి, చౌటుప్పల్ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే అనేక నిర్మాణాలు ఉన్నాయి.
ఆ కూడళ్లలో పెద్ద పెద్ద లూపులు నిర్మిస్తే భూసేకరణ పెద్ద సమస్య అవుతుంది. ఈ క్రమంలో ‘ఎక్స్టెండెడ్ డంబెల్’ మోడల్‌ను ఎంపిక చేశారు. ఈ డిజైన్‌లో, వాహనాలు లేన్లను మార్చే సర్క్యూట్లు ఎక్కువగా రింగ్ రోడ్లుగా ఉంటాయి. దీని నిర్మాణానికి అవసరమైన భూమిలో 70% వరకు రింగ్ రోడ్డు భూమికి అనుగుణంగా ఉంటుంది. మిగిలిన 30 శాతం భూమిని సేకరిస్తే సరిపోతుంది.
రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతుండడంతో జాతీయ రహదారుల సంస్థ హైవే నిర్మాణంపై దృష్టి సారించింది. మరో మూడు నెలల్లో బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం కావచ్చు. దీనికోసం హైవే డిజైన్‌ను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రస్తుతం ఉత్తర భాగం అంటే సంగారెడ్డి నుంచి గజ్వేల్ మీదుగా చౌటుప్పల్ వరకు మొత్తం 162 కి.మీ. నిర్మాణం మొదలు పెడతారు. ఈ హైవే ఉత్తరం వైపు మొత్తం 11 జంక్షన్స్ తో ఉంది. ఇందులో రెండు ఇంటర్‌ఛేంజ్‌లు ఉన్నాయి. ఇక్కడ అది దక్షిణం వైపు కలుస్తుంది. వీటి డిజైన్స్ సిద్ధంగా ఉన్నాయని చెబుతున్నారు.
భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’ డిజైన్‌తో సంగారెడ్డిలో జంక్షన్ నిర్మిస్తారు. దేని తర్వాత రెండో డబుల్ డంబెల్ లేఅవుట్ క్రాసింగ్ శివ్వంపేట వద్ద ఉంది. ఇది జాతీయ రహదారి నంబర్ 161 దాటుతుంది.
- నర్సాపూర్-మెదక్ రహదారిలో నర్సాపూర్ వద్ద మూడో కూడలిని నిర్మిస్తారు
- హైదరాబాద్-నాగ్‌పూర్ హైవేలో తుప్రాన్ వద్ద ఉన్న నాల్గవ జంక్షన్ కోసం క్లోవర్ లీఫ్ డిజైన్ ఎంపిక చేశారు.
- తూప్రాన్-గజ్వేల్ రహదారిలో మజీద్‌పల్లి వద్ద ఐదో జంక్షన్ వస్తుంది
- రాజీవ్ రహదారిలోని ప్రజ్ఞాపూర్ సమీపంలో ఆరో కూడలి ఉంది.
- జగదేవ్ పూర్-తుర్కపల్లి మధ్య పీర్లపల్లి వద్ద ఏడో కూడలి ఉంటుంది
- తుర్కపల్లి-యాదగిరిగుట్ట రహదారిపై ఎనిమిదో కూడలి తుర్కపల్లికి చేరుతుంది.
- తొమ్మిదో జంక్షన్ హైదరాబాద్-వరంగల్ హైవేపై రాయగిరి వద్ద ఉంటుంది.
- ఇక పదో కూడలి భువనగిరి-వలిగొండ రహదారిపై వలిగొండకు చేరుస్తుంది.
- అలాగే చివరి కూడలి చౌటుప్పల్‌లో భారీ ‘ఎక్స్టెండెడ్ డంబెల్’ డిజైన్‌తో నిర్మిస్తారు.
Also Read : శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత