Regina Cassandra: నటి రెజీనా కసాండ్ర.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ్, తెలుగు భాషల్లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ కెరీర్ స్టార్ చేసిన ఈ బ్యూటీ 2012లో ‘శివ మనసులో శృతి’ (SMS)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కొత్తజంట సినిమాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది.
Vijay Devarakonda, Pooja Hegde: ఫ్యామిలీ స్టార్ పాటకు స్టెప్పులేసిన పూజ, విజయ్.. వైరలవుతున్న వీడియో
పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా
అయితే గత కొంత కాలంగా పెద్దగా సినిమా అవకాశాలు దక్కించుకోని రెజీనా.. ప్రస్తుతం వెబ్ సీరీస్ పై ద్రుష్టి పెట్టింది. వరుస వెబ్ సీరీస్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా.. ఈ ముద్దు గుమ్మ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెజీనా ఓ బిజినెస్ మెన్ ను వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగినట్లు సమాచారం. త్వరలోనే ఈ గుడ్ న్యూస్ ను రెజీనా అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని టాక్.
ఇదివరకు కూడా ఈ బ్యూటీ పై ఇలాంటి రూమర్స్ భారీగానే వచ్చాయి. గతంలో హీరో సందీప్ కిషన్ తో రిలేషన్ లో ఉన్నారని ప్రచారం జరగగా.. అందులో నిజం లేదని సందీప్ క్లారిటీ ఇవ్వడంతో.. అది కాస్త అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ను ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మరో వార్త వైరలైంది. ఇదీ కేవలం రూమరే అని తేలిపోయింది. ఇక ఇప్పుడు మరో సారి వైరలవుతున్న ఈమె పెళ్లి న్యూస్ నిజమా..? లేదా కేవలం గాసిప్ మాత్రమేనా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం.. వైరలవుతున్న ఫొటోలు