SA vs IND : దక్షిణాఫ్రికాతో (South africa) తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith)మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టెస్ట్ (Test) సిరీస్ కు ముందు సరైన ప్రాక్టీస్ లేకపోవడం వల్లే భారత్ ఓడిపోయిందనే కామెంట్స్ ను తప్పుపట్టాడు. అలాగే ఇంట్రా స్క్వాడ్ పోటీల కోసం ప్రాక్టీస్ మ్యాచ్‌లను రద్దు చేయడంపై కూడా మట్లాడిన ఆయన.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రాక్టీస్ టెస్టుల వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నాడు.
‘మేము గత ఆరు నెలల్లో ఫస్ట్‌క్లాస్ టెస్టులతోపాటు చాలా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాం. అయితే, అసలైన టెస్టు మ్యాచ్‌ల కోసం వినియోగించే పిచ్‌లను ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో వాడరు. అందుకే, మేం అలాంటి వాటికి దూరంగా ఉన్నాం. మాకు అవసరమైన విభాగాలపై దృష్టి పెట్టాం. మాకు అనుకూలమైన పిచ్‌ను తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేశాం. గతంలో మేం ఆసీస్‌కు వెళ్లినప్పుడు, దక్షిణాఫ్రికాతో 2018 పర్యటనలోనూ ఇలాగే చేశాం. ప్రాక్టీస్ పిచ్‌లపై బంతి ఎక్కువగా బౌన్స్ కాదు. కానీ, ఫైనల్ పోటీలో మాత్రం తలపైకి బౌన్స్ అవుతుంది. అందుకే మాకు అవసరమైన తరహాలో పిచ్‌లు తయారు చేయించుకుని ప్రాక్టీస్ చేశాం. ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ అలాంటి పిచ్‌లు ఉంటే ఓకే. మేం కూడా ఆడతాం. రెండో టెస్టులో తప్పకుండా గెలిచి సిరీస్ ను సమం చేస్తామనే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి : Revanth-Komatireddy: వేగం ఒకడు-త్యాగం ఒకడు.. రేవంత్ రెడ్డి ఫొటోలతో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ఇదిలావుంటే.. భారత పేసర్ శార్దూల్ (Shardul) ఠాకూర్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ భుజానికి బలంగా బంతి తాకింది. దీంతో శార్దూల్ చాలా అసౌకర్యంగా కనిపించాడు. బౌలింగ్ కూడా చేయలేదు. జనవరి 3న ఆరంభమయ్యే రెండో టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు.