Sankranti : శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే దానిని మకర సంక్రమణం అంటారు. ఆ రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా వివిధ పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి(Sankranti) నిజంగా మూడు రోజుల పండుగ కాదు..నెల రోజుల పండుగ అని చెప్పవచ్చు.
నెల రోజుల ముందు నుంచే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ వాటిలో గొబ్బిళ్లు పెట్టి వాటికి పూలతో అలంకరం చేస్తారు. ఆ గొబ్బిళ్లను భోగి(Bogi) పండుగ నాడు భోగి మంటల్లో వేసి చిన్న పిల్లలు, పెద్దవారు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ అయినటువంటి ఈ సంక్రాంతికి ఉద్యోగాలు, చదువులు నిమిత్తం పట్టణాల్లో స్థిరపడిన వారంతా కూడా ఈ పండుగకు మాత్రం సొంతూర్లకు కచ్చితంగా వచ్చి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు.
నది స్నానం…
ఈ సంక్రాంతి పండుగ నాడు కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. వాటిని చేయడం వల్ల లక్ష్మీ దేవి కటాక్షం పొందడంతో పాటు పుణ్యం కూడా సంపాదించుకోవచ్చు. సంక్రాంతి పండుగ నాడు వీలైతే నది స్నానం చేయడం మంచిది. నది స్నానం కుదరని వారు ప్రవాహించే నీటిని ఓ బాటిల్ లో తీసుకొని వచ్చి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది విశ్వసిస్తారు.
సూర్యోదయానికంటే ముందే
సంక్రాంతి పండుగ రోజున సూర్యోదయానికంటే ముందే స్నానం చేయాలి. తరువాత సూర్యునికి నమస్కారం చేసుకోవాలి. పండుగ రోజున పూర్వీకుల ఆత్మకు శాంతి కలిగేందుకు వారికి తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతికి చేకూరి శుభ ఫలితాలొస్తాయి. సంక్రాంతి పండుగ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని వేద పండితులు వివరిస్తున్నారు.
Also Read : సంక్రాంతి స్పెషల్..చెక్కలు, నెలవంకలు, సున్నుండలు ఇలా చేస్తే ఆ టేస్ట్ అదుర్స్..!!
వీలుంటే మన సామర్థ్యాన్ని బట్టి నిరుపేదలకు ఆహారం, దుస్తులు, దుప్పట్లు వంటివి దానం ఇవ్వాలి. అలాగే నల్ల నువ్వులను, బెల్లం దానం చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో నువ్వులతో తయారు చేసిన లడ్డూలు, నువ్వుల రొట్టెలు, సకినాలను కూడా పేదలకు పంచి పెట్టాలి.
ఈరోజున బిక్షాటన చేసే వాళ్లు ఇంటి ముందుకు వస్తే మాత్రం ఏమి ఇవ్వకుండా పంపకూడదు. శక్తి ఉన్నంత వరకు మీకు తోచిన సాయం చేయండి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే పండుగ రోజు చెట్లకు , తులసి మొక్కకు నీరు సమర్పించి పూజ చేస్తే ఐశ్వర్యం పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.
సంక్రాంతి పర్వదినాన దేవతల అనుగ్రహం ఎంతో ముఖ్యమైనది. ఈరోజున వారికి బెల్లం, నువ్వులు, పెరుగు, తాజా వరితో చేసిన అన్నం, వడ సమర్పిస్తే వారి ఆశీర్వాదం ఎల్లప్పూడు మీ మీద ఉండడంతో పాటు మీకు లక్షీ కటాక్షం కలిగే అవకాశం ఉంది.
Also read: గోతిలో పడిన అంబులెన్స్..లేచి కూర్చున్న శవం!