pcc chief revanth reddy
Uttam Kumar Reddy: సీఎం పదవికి పరిశీలనలో నా పేరు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీఎం పదవికి తాను కూడా రేసులో ఉన్నానని మాజీ పీసీసీ చీఫ్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా.. అది కూడా కాంగ్రెస్ పార్టీలోనే (Congress Party) గెలిచానని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నానన్నారు. తనకు ఉన్న శక్తినంతా ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ బలపడడానికి నిరంతరం ప్రయత్నం చేశానన్నారు. రాజకీయాల్లోకి రాకముందు భారత సైన్యంలో పని చేశానని వివరించారు ఉత్తమ్. అక్కడ కూడా తనకు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Telangana New CM: సీఎం ఫైనల్ రేసులో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్.. హైకమాండ్ ఎవరి వైపు?
సీఎం పదవికి తన పేరును కూడా తప్పకుండా పరిశీలిస్తారని ఆశిస్తున్నానన్నారు. పీసీసీ చీఫ్ గా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. మిల్ట్రీలో పని చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీలోనూ తాను ఓ క్రమశిక్షణ కలిగిన సైనికుడినేనన్నారు. కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్, ఆలస్యం లేదన్నారు ఉత్తమ్.
ఇది కూడా చదవండి: Vijayashanthi-KCR: ‘కేసీఆర్ అన్నా.. ఓడిపోయావా’ విజయశాంతి ట్వీట్ వైరల్!
ఈ విషయంలో తమ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అవుతోందన్నారు. మీడియా, సోషల్ మీడియాలో అనవసరంగా రాంగ్ హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు. ఫలితాలు వచ్చిన 12 గంటల్లోనే సీఎల్పీ మీటింగ్ నిర్వహించామన్నారు. ఫలితాలు విడుదలై 48 గంటలు కూడా కాలేదన్నారు.
రేవంత్ పుట్టుకే ఆరెస్సెస్‌లో ఉంది.. కాంగ్రెస్ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తోంది: అసదుద్దీన్ ఓవైసీ
Telangana Elections 2023: నాంపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉందని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కారణంగానే కేంద్రంలో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోందని వ్యాఖ్యానించారు. బీజేపీ విజయాలకు కాంగ్రెస్ తనను బాధ్యుడిగా చెబుతోందని, ఆ పార్టీ విజయం సాధిస్తే తాను ఎలా బాధ్యుడిని అవుతానని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సంచలన సవాల్!
సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ తనపై దుష్ప్రచారం చేస్తోందని అసదుద్దీన్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆరెస్సెస్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎవరెన్ని చెప్పినా, బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన చోట మజ్లిస్ పార్టీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామన్నారు. తమ ఏడు స్థానాలను కైవసం చేసుకుంటామని తెలిపారు.
KCR: చిప్పకూడు తిన్నా సిగ్గు రాలే.. నీతి లేనోడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ స్ట్రెయిట్ అటాక్
ఈ రోజు కొడంగల్ లో పర్యటించిన సీఎం కేసీఆర్ (CM KCR) పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. అందరినీ తిట్టడం తప్పా.. ఆయన కొడంగల్ నియోజకవర్గానికి చేసేందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలే కరెంట్ చాలంటున్నాడని ధ్వజమెత్తారు. 24 గంటల కరెంట్ ఉండాలంటే కొడంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలవాలన్నారు. రైతులు 10 HP మోటార్లు పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అంటున్నాడన్నారు. ఈ విషయాన్ని రైతులు ఆలోచన చేయాలని కోరారు. వ్యవసాయం చేసే రైతులు ఇలా మాట్లాడరన్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా దున్నినోడా? అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: TS Elections: మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే… ఖర్గే చురకలు!
ఆయన ఓ పెద్ద భూకబ్జాదారుడని ఆరోపించారు కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను తీసేసి బంగాళాఖాతంలో వేస్తారట.. అంటూ ఫైర్ అయ్యారు. అలా చేస్తే మళ్లీ వీఆర్వోలు వస్తారన్నారు. ధరణిని తీసేస్తే పైరవీకారులు వస్తారని హెచ్చరించారు. ఒకరి భూమి మరొకరికి రాసే ప్రమాదం ఉంటుందన్నారు. నిజాయితీతో ఆలోచించి ఓటు వేయాలని ఓటర్లను కేసీఆర్ కోరారు. 9 ఏళ్లల్లో రేవంత్ రెడ్డి వాళ్లు, వీళ్లను తిట్టడం తప్పించి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదని ఫైర్ అన్నారు. రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Gulabeela Jendalamma Song: హరీశ్‌రావు నోట రామక్క పాట.. కాంగ్రెసోళ్లు నకలు కొట్టారంటూ సెటైర్లు..
తెలంగాణ ఉద్యమ సమయంలో రేవంత్ రైఫిల్ తో ఉద్యకారులపైకి వెళ్లాడన్నారు. రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి రూ.50 లక్షలు లంచం ఇస్తూ దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. చిప్ప కూడు తిన్నా ఆయనకు ఇంకా.. సిగ్గురాలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు.. మన్ను కాడన్నారు.
నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ఆయన స్థాయి పెరుగుతుందన్నారు. ఆ ఫాల్తు రేవంత్ రెడ్డి ఇచ్చే మందు సీసాలకు మోసపోవద్దన్నారు. రేవంత్ రెడ్డికి ఓ నీతి లేదు, ఓ పద్ధతి లేదు, ఓ నియమం లేదన్నారు. ఎన్నడూ రేవంత్ రెడ్డి పేరు ఎత్తడానికి పెద్దగా ఆసక్తి చూపని సీఎం కేసీఆర్.. ఈ రోజు ఆయన పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం రాజకీయ వార్గాల్లో ఆసక్తిగా మారింది.
Revanth Reddy: ఓటుకు రూ. 10 వేలు.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Telangana Elections 2023: తెలంగాణలో మరో 12 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారంలో భాగంగా ఈరోజు కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఈ నేపథ్యంలో కామారెడ్డిలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ (CM KCR)పై నిప్పులు చెరిగారు.
ALSO READ: బీడీ కార్మికులకు రూ.5,000 పెన్షన్..
కామారెడ్డి జిల్లా భిక్కనూరులో ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు కామారెడ్డి భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు అని పేర్కొన్నారు. పుట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి హామీ ఇచ్చి ఏర్పాటు చేయలేదని ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో ఉన్న రైతుల భూములను మింగేందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటుకు రూ. 10 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలిస్తే కామారెడ్డిలో వ్యవసాయం చేసుకునేందుకు భూములు ఉండవని అన్నారు.
ALSO READ: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా మొదటి తారీఖు రూ.2500 ఖాతాలో వేస్తామని అన్నారు. రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
Revanth Reddy: ధరణి బదులుగా కొత్త యాప్.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
TS Elections: మరో 23రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కేసీఆర్(KCR) ప్రచారాల్లో బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలను విమర్శిస్తూ జెట్ స్పీడులో ముందుకు పోతున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కేసీఆర్ కు ఏమాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Also Read: ఆ బీఆర్ఎస్ అభ్యర్థి మార్పు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్(Alampur)లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ధరణి(Dharani) పోర్టల్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త యాప్ ను ప్రవేశపెడుతామని అన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్.. అది నిజమని నిరూపిస్తే తాను నామినేషన్ వేయనని సవాల్ విసిరారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.
కేసీఆర్.. నీకు దమ్ముంటే నేను రైతులకు మూడు లేదా ఐదు గంటల కరెంట్ ఇస్తామని చెప్పినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఓడిపోతామనే భయంతో కేసీఆర్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారితో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ఈ తుగ్లక్ పాలనకు చెక్ పెట్టాలని రేవంత్ పేర్కొన్నారు. జోగులాంబ ఆలయం అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్(Sampath Kumar)ను భారీ మెజార్టీతో గెలిపించాలని అక్కడి ఓటర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read: రాళ్లతో కొట్టి ఆంధ్రకు పంపుతాం.. షర్మిలకు సొంత నేతల షాక్!