శనివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారని సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.’ వచ్చే 25 ఏళ్లలో వికసిత్ భారత్ సాధించే దిశగా ప్రధానమంత్రి మోదీ పలు కీలక సూచలు చేశారు. సీఎం మమతా బెనర్జీకి సమావేశంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పడం వాస్తవం కాదు. ప్రతి ముఖ్యమంత్రి మాట్లాడేందుకు 7 నిమిషాల వరకు సమయం ఇచ్చాం. రెండు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది.
Also Read: ఘోర ప్రమాదం.. ఐదుగురు చిన్నారులతో సహా 8 మంది మృతి
2047 నాటికి వికసిత్ భారత్ సాకారం అయ్యే ప్లాన్‌పై చర్చలు జరిపాం. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలపై చర్చించాం. వికసిత్ భారత్‌పై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన డాక్యుమెంట్‌పై వివరించాం. వికసిత్ భారత్ సాధించాలంటే అన్ని రాష్ట్రాల సహకారం చాలా కీలకం. రాష్ట్రాలు అమలు చేయాల్సిన ప్రణాళికలపై సూచనలు చేశాం. వైద్యరంగంలో తీసుకురావాల్సిన సంస్కరణపై, సైబర్ సెక్యూరిటీలో అమలుచేయాల్సిన సాంకేతిక పరిజ్ఞానంపై చర్చలు జరిపాం. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల సూచించిన ప్రణాళికలను సైతం నీతి ఆయోగ్ విన్నది.
కొన్ని రాష్ట్రాల సూచలను, వాళ్ల ప్లాన్లు బాగున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళతో పాటు పది రాష్ట్రాల నుంచి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనలేదని బీవీఆర్ సుబ్రహ్మణ్యం వివరించారు. ఇదిలాఉండగా.. ఈ నీతిఆయోగ్ సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్రమంత్రులతో సహా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Also read: రీల్స్ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు