Kargil War: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1999లో తాను, మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి భారత్‌తో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆయన మంగళవారం అంగీకరించారు. కార్గిల్‌లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ జరిపిన దాడి గురించి ఇచ్చిన స్పష్టమైన వివరణలో పాక్ మాజీ ప్రధాని ఈ విషయం చెప్పారు. పాకిస్థాన్ అణుపరీక్ష జరిగి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పీఎంఎల్-ఎన్ సమావేశంలో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ. 1998 మే 28న పాక్ ఐదు అణుపరీక్షలు నిర్వహించిందని.. ఈ ఐదు పేలుళ్లతో భారత్ దీటుగా స్పందించింది.
Kargil War: ఆ తర్వాత అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి లాహోర్‌కు వచ్చి తనకు వాగ్దానం చేశారని, ఆ సమయంలో లాహోర్ ఒప్పందంపై సంతకాలు చేశారని నవాజ్ షరీఫ్ చెప్పారు. రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరతకు సంబంధించిన దృక్పథం గురించి మాట్లాడే ఈ ఒప్పందం పెద్ద విజయాన్ని సాధించింది. ఆ వాగ్దానానికి విరుద్ధంగా వెళ్లాం అనేది వేరే విషయం. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు పాకిస్థాన్ దోషి అని ఆయన అంగీకరించారు.
భారత్‌తో ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది
Kargil War: పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ 1999లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ పై చేసిన చర్యతో.. తాను, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంతకం చేసిన ఒప్పందాన్ని ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని అన్నారు. ఒప్పందం జరిగిన కొద్ది నెలలకే కార్గిల్ యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
‘అణు పరీక్షలను ఆపేందుకు 5 బిలియన్ డాలర్ల ఆఫర్’
Kargil War: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అణుపరీక్షలు నిర్వహించకుండా పాకిస్థాన్‌కు 5 బిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చారని, అయితే వారు దానిని అంగీకరించడానికి నిరాకరించారని షరీఫ్ చెప్పారు. తన స్థానంలో (మాజీ ప్రధాని) ఇమ్రాన్ ఖాన్ లాంటి వ్యక్తి ఉండి ఉంటే, క్లింటన్ ప్రతిపాదనను తాను అంగీకరించేవాడడేనని నవాజ్ అన్నారు.
ఇంకా, 72 ఏళ్ల నవాజ్ షరీఫ్ 2017లో అప్పటి పాకిస్థాన్ చీఫ్ జస్టిస్ సాకిబ్ నిసార్ తప్పుడు కేసులో తనను ప్రధాని పదవి నుంచి ఎలా తొలగించారో కూడా చెప్పారు. తనపై ఉన్న కేసులన్నీ అవాస్తవమని, అయితే పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపక నేత ఇమ్రాన్ ఖాన్‌పై కేసులు నిజమేనని అన్నారు.
తమ్ముడు షాబాజ్ షరీఫ్‌కు ప్రశంసలు
Kargil War: దీంతో పాటు తన తమ్ముడు, పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌పై కూడా నవాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. ప్రతి బ్యాడ్ టైంలో షరీఫ్ తనకు అండగా నిలిచారని అన్నారు. మా మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరిగింది కానీ షాబాజ్ నాకు విధేయుడిగానే ఉన్నాడు అంటూ కితాబిచ్చారు.
మొత్తమ్మీద భారత్ తో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఒక పాక్ మాజీ ప్రధాని బహిరంగంగా అంగీకరించడం ఇపుడు సంచలనంగా మారింది. నిజానికి గతంలో ఎప్పుడూ కూడా పాక్ నుంచి ఈ స్థాయి నాయకులు ఇటువంటి ప్రకటన చేయలేదు. అక్కడి రాజకీయాల నేపధ్యంలో షరీఫ్ ఇలా మాట్లాడారని అనుకున్నా.. భారత్ విషయంలో పాక్ చేసిన కుతంత్రాన్ని ఆయన ఒప్పుకున్నట్టయింది.