Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తాపత్రయపడుతున్నాం కానీ మరోవైపు అవే తింటున్నాం. దేశంలో మనకు దొరుకుతున్న అన్ని బ్రాండ్ల ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్స్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనంలో ఇది తేలింది.