Micro Plastic: మనం రోజూ ప్లాస్టిక్‌ను తింటున్నాం. ఇప్పటికే చాలా పదార్ధాల్లో ప్లాస్టిక్‌ను కలుపుతున్నారని తేలింది. ఇప్పుడు ఉప్పు. చక్కెరల్లో కూడా ఇది ఉందని తెలుస్తోంది. టాక్సిక్స్ లింక్’ అనే పర్యావరణ పరిశోధన సంస్థ ‘మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్’ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో దేశంలో అమ్ముతున్న అన్ని బ్రాండ్ల ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్ ఉందని తెలిసింది. పెద్ద , చిన్న బ్రాండ్ అని లేకుండా అన్నింటిలోనూ ప్లాస్టిక్ ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉప్పు, చక్కెరల్లో మైక్రో ప్లాస్టిక్స్ కలిసి ఉంటున్నాయి. దీంతో ఇవి మనం గుర్తించలేనంత చిన్నగా మన కడుపుల్లోకి వెళుతున్నాయి. అయితే ఇవి వెంటనే మన శరీరానికి ఏమీ ఎఫెక్ట్ చూపించకపోయినా..కొన్నేళ్ళకు రోగాలకు దారి తీయొచ్చని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Plastic: ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్..అన్ని బ్రాండ్లలో ఇదే తంతు
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తాపత్రయపడుతున్నాం కానీ మరోవైపు అవే తింటున్నాం. దేశంలో మనకు దొరుకుతున్న అన్ని బ్రాండ్ల ఉప్పు, చక్కెరల్లో ప్లాస్టిక్స్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనంలో ఇది తేలింది.
Translate this News: