KTR: నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ వద్ద నిర్మిస్తున్న సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై (Megha Company) పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా కూడా ఈ వ్యవహారంపై రేవంత్ సర్కార్ ఇంకా చర్యలు తీసుకోలేదు.
Also Read: నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా ?
ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి ఎక్స్‌లో స్పందించారు. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదం జరిగి 10 రోజులు దాటిందని.. ఇంకా మేఘా ఇంజినీరింగ్ కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై మీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది. మేఘా కంపెనీపై ఎందుకు సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
More than 10 days since #Sunkishala mishap. Why is there no action initiated on the agency Megha Engineering & Infrastructure Limited !?
Any answers why your Government is hushing up and going soft on the agency @RahulGandhi Ji ? pic.twitter.com/Mp5EXwJkoH
— KTR (@KTRBRS) August 12, 2024
Also Read: కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ..