ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఏదోక మూల అగ్ని ప్రమాదాలు (Fire Accident) సంభవిస్తునే ఉన్నాయి. తాజాగా మాదాపూర్లోని ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ వద్ద ఉన్న గర్ల్ ప్రెండ్ మండి గ్రౌండ్ ఫ్లోర్ లో సోమవారం రాత్రి పది గంటల సమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన హోటల్ సిబ్బంది, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు.
Updated soon…