Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేతకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీళ్ళు దాదాపు కేబినెట్ మంత్రితో సమానం. మంత్రికి ఉండే భద్రతే ప్రతిపక్ష నేతకు కూడా ఉంటుంది. ఇందులో Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేబినెట్ మంత్రి తరహా ప్రభుత్వ బంగ్లా కూడా ఇస్తారు. ఇక వీరి జీతం విషయానికి వస్తే పార్లమెంటు చట్టం 1977లో ప్రతిపక్ష నాయకుల జీతాలు, అలవెన్సుల ప్రకారం రాహుల్ గాంధీ జీతం రూ. 3.3 లక్షలు ఉంటుంది. ఇక విపక్షనేత పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో ముందు వరుసలో కూర్చోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం..
ఇక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ప్రతిపక్ష నేతకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. కీలకమైన ప్యానెల్స్‌లో విపక్షనేత రాహుల్ గాంధీ కూడా ఒక సభ్యుడిగా ఉంటారు. ఎన్నికల్ కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్ లాంటి నియామకాల్లో ప్రధానితో పాటూ ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఇప్పటివరకు అన్ని అధికారాలు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. గడచిన పదేళ్ళల్లో అన్ని కీలక నిర్ణయాలు ఆ పార్టీ నేతలే ఏకపక్షంగా తీసుకున్నారు. అదికాక బీజేపీ కేంద్ర దర్యాప్తు సస్థలను తమ సొంత సంస్థల కింద వాడుకుంటోందని చాలా ఆరోణలు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి వచ్చిన అధికారాలు, ప్రతిప్ష నేతా ఆయన హోదా ఇండియా కూటమికి పెద్ద ఊతం కానుంది. ఈసారి గవర్నమెంటును నడపడం అంత ఈసారి కాదని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ఎన్డీయేలో టీడీపీ, జేడీయూ భాగస్వామ్యులు కావడం, ఇప్పుడు లోక్‌సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికవడం…బీజేపీకి అడ్డుకట్టవేసినట్టే అయింది.
గాంధీ కుటుంబం నుంచి మూడో వ్యక్తి..
ఇక గాంధీ ఫ్యామిలీ నుంచి లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పదవి చేపట్టిన మూడోనేతగా రాహుల్ గాంధీ నిలవనున్నారు. ఇంతకు ముందు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ విపక్ష నేతలుగా ఉన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షంగా ఉండాలంటే ఏ పార్టీకి అయినా 10శాతం కంటే ఎక్కువ సీట్లు రావాలి. దీని ప్రకారం 2014, 2019ల్లో కాంగ్రెస్‌కు 44,52 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు రావడంతో ప్రతపక్ష హోదా దక్కించుకుంది.
Also Read:Jammu-Kashmir: జమ్మూ కాశ్మీర్లో కాల్పులు..ముగ్గురు ఉగ్రవాదులు మృతి