Vajedu: పోలీసు బలగాలు అమాయక ప్రజలను అన్యాయంగా చంపుతున్నారంటూ మావోయిస్ట్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ‘భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ’ పేరిట లేఖ విడుదలైంది.
’12వ తేదీన ములుగు జిల్లా, వెంకటాపురం మండలం తడుపాలా గ్రామెం వద్ద 10 గంటలకు గ్రేహౌండ్ పోలీసులు నిరాయుధులైన ముగ్గురు సభ్యులు రీతా, మోతీ, ఇడ్మాల్ లతో పాటు తమ పనుల రిత్యా అడవికి వెళ్తున్న ముగ్గురు ప్రజలను మార్గ మధ్యలో పట్టుకుని వారిని ఎన్ కౌంటర్ పేరుతో చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి సంబంధం లేని అమాయకులను బాంబుల గురించి చెప్పాలంటూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, బుద్ధి జీవులు పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి’ అంటూ కార్యదర్శి శాంత పేరిట విడుదలైన లేఖలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు స్పందించాల్సివుంది.