Bhale Unnade Movie Teaser : హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) – లావణ్య (Lavanya) ప్రేమ వ్యవహారం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇక రాజ్ తరుణ్ ఒక వైపు లావణ్య వివాదంతో సతమమవుతూనే.. మరో వైపు చక చక సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే పురోషోత్తముడు, తిరగబడసామి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. మరో సినిమాతో విడుదలకు సిద్దమయ్యాడు రాజ్.
భలే ఉన్నాడే రిలీజ్ డేట్
తాజాగా శివసాయివర్ధన్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade) రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని వినాయకచవితి (Vinayaka Chavithi) కానుకగా సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు పోస్ట్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ మూవీ గ్లింప్స్ , టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ బ్యానర్స్ పై N.V. కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మనీషా కంద్కూర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇందులో రాజ్ టైలర్, బ్యూటీషియన్ గా సరి కొత్త పాత్రలో అలరించనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది.
View this post on Instagram
Also Read: Mr.Bachchan Review: మిస్టర్ బచ్చన్ మూవీ ఎలా ఉందంటే.. వీరి రివ్యూలు చూడండి! – Rtvlive.com