Senior Actor Babu Mohan Fires On Jabardasth Comedian Kiraak RP : జబర్దస్త్ ద్వారా కిరాక్ ఆర్పి గా గుర్తింపు పొందిన ఆర్పి.. తన డిఫరెంట్ స్టైల్ కామెడీతో బాగా ఫేమస్ అయ్యాడు. మొదట ధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేసి, తర్వాత టీమ్ లీడర్ అయ్యాడు. కొన్నాళ్ళు టీమ్ లీడర్ గా తన స్కిట్స్ తో ఆడియన్స్ ను బాగానే నవ్వించాడు. అయితే అప్పటి వరకు జబర్దస్త్ జడ్జి గా ఉన్న నాగబాబు షో నుండి బయటకు వచ్చేసారు. ఆయనతో పాటే కిర్రాక్ ఆర్పి కూడా బయటకు వచ్చేసారు. ఆ తరువాత జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో చేసాడు.
ఇదిలా ఉంటే ఆర్పీ ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో మల్లెమాల సంస్థపై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తిండి సరిగా ఉండదని చెప్పారు. జబర్దస్త్ ద్వారా ఎన్నో కోట్లు సంపాదిస్తున్నా అక్కడ వసతులు సరిగా ఉండవని సరైన తిండి ఉండదని, గౌరవం ఇచ్చేవారు కాదని చెప్పారు. అయితే ఆర్పీ చేసిన ఈ ఆరోపణలపై ప్రముఖ సీనియర్ కమెడియన్, నటుడు అయిన బాబూమోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ క్రమంలోనే ఆర్పీ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : హీరోయిన్ల గురించి మాట్లాడొద్దా?: అనిల్ రావిపూడి సంచలన కామెంట్స్!
నువ్వెంతా? నీ బతుకెంతా?
” జబర్దస్త్ లోకి రాకముందు నువ్వెంత ? నీ బతుకెంత? పొట్ట కూటికోసం ఇక్కడికి వచ్చావు. వచ్చాక నిన్ను నలుగురు గుర్తు పట్టేసరికి నీ కళ్ళు నెత్తికెక్కాయి. మల్లెమాల అంటే ఎవరు చిత్ర సీమకే ఓకే తండ్రి MS రెడ్డి గారు. జబర్దస్త్ ను నడిపేది ఆయన కొడుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి. అలాంటి ఓ గొప్ప సంస్థ నీకు అన్నం పెట్టింది. ఆ సంస్థపై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గు లేదు.. అన్నం పెట్టిన చేయినే కొరుకుతావా? అని ఆర్పిపై మండిపడ్డారు.
అన్నం పెట్టిన చేయిని కొరికితే ఆ తర్వాత ఆ అన్నం దొరకకుండా పోతుంది. ఎంతోమందికి పనిచ్చి అన్నం పెట్టే ఆ సంస్థ ఇంకా బాగుండాలి అని కోరుకోవాలి తప్పా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నాకు జీవితాన్ని ఇచ్చింది కూడా ఆ సంస్థే. నన్ను ఈ రోజు ఇంత పెద్ద స్టార్ ను చేసింది కూడా వాళ్లే” అని అన్నారు. దీంతో బాబూమోహన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.