All Eyes On Rafah: ఇజ్రాయిల్ – గాజా మధ్య యుద్దం తీవ్రత మరింతగా పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు 45 మంది వరకు మరణించారు. ఈ విషయం ప్రపంచాన్ని కదిలించింది. దీంతో ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖులు, క్రీడాకారులు మిలియన్ల సంఖ్యలో సోషల్ మీడియాలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని విపరీతంగా ట్రెండ్ చేశారు.
ఈ దాడి ఘటన ఇజ్రాయిల్‌ని మరింత ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. అమెరికా కూడా ఈ దాడి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే, దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ కూడా అంతే ధీటుగా స్పందించింది. రఫాపై కన్నీరు కారుస్తున్న వారంతా ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి, అభంశుభం తెలియని చిన్నారులను చంపినప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఓ సోషల్ మీడియా పోస్టుని ఇజ్రాయిల్ పంచుకుంది. గన్ పట్టుకున్న హమాస్ ఉగ్రవాది ముందు ఓ చిన్న పిల్లాడు ఉన్న ఫోటోని ట్విట్టర్లో పంచుకుంది. అక్టోబర్ 7 దాడిలో హమాస్ ఉగ్రవాదులు చేతిలో 1200 మంది మరణించడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు.
ప్రస్తుతం ఉగ్రవాదుల చేలితో 99 మంది బందీలు సజీవంగా ఉన్నారని, 31 మంది మరణించారని ఇజ్రాయిల్ భావిస్తోంది.హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. అయితే, ఉత్తరాన ఉన్న గాజా నగరాన్ని జల్లెడ పట్టినప్పటికీ అక్కడ ఇజ్రాయిల్ బందీలు లేకపోవడంతో, హమాస్‌కి మరో స్థావరంగా ఉన్న దక్షిణాన ఉన్న రఫాని టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన దాడిలో 45 మంది మృతి చెందారు.
We will NEVER stop talking about October 7th.
We will NEVER stop fighting for the hostages. pic.twitter.com/XoFqAf1IjM
— Israel ישראל (@Israel) May 29, 2024
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా, రఫాపై పోస్టు పెడుతున్న వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి. మేమే అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఆపము, మేము బందీల కోసం పోరాటాన్ని ఎప్పటికీ ఆపము’’ అని ఆయన స్పష్టం చేశారు. దాదాపుగా 45 మిలియన్ల మంది యూజర్లు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ ఆల్ ఐస్ ఆన్ రఫా’’ వైరల్ చేశారు.
Also read: వామ్మో ఆ బిల్డింగ్ ల మీద పిడుగులు ఎలా పడ్డాయో చూశారా!