స్మార్ట్ఫోన్లు వాడే చాలమందికి ఐఫోన్ కొనుక్కోవాలనే ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్‌న్యూస్. యాపిల్ తన ఐ-ఫోన్ 13,14,15 సిరీస్ ఫోన్ల ధరలు తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ మీద కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఫొన్ ధరలు తగ్గించింది. ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్ల ధరలు రూ.5,100 నుంచి 6 వేల వరకు తగ్గాయి.
Also read: కమలా హారీస్‌కు మద్దతిచ్చిన బరాక్ ఒబామా.. వీడియో వైరల్
ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 లతో పాటు భారత్‌లో తయారయ్యే ఐఫోన్ల ధరలు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధరలు రూ.2300 తగ్గనున్నాయి. యాపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలు తగ్గించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈసారి బడ్జెట్లో కేంద్రం.. కస్ట్స్ డ్యూటీని 20 నుంచి 15 శాతానికి తగ్గించింది. వాస్తవానికి కొత్త ఐ-ఫోన్ మార్కెట్లోకి వచ్చిప్పుడు పాత మోడల్ ఫోన్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక యాపిల్ ధరలు తగ్గింపుతో పాటు డీలర్లు,రీసెల్లర్లు తమ వద్ద నిల్వ ఉన్న ఫోన్లను అమ్మేందుకు అదనపు డిస్కౌంట్లు కూడా ఇస్తుంటారు.
Also Read: ఐటీలో చేరాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. 90 వేల కొత్త ఉద్యోగాలు
యాఫిల్ తగ్గించిన ధరల వివారాలు
ఐ-ఫోన్ ఎస్ఈ – రూ.49,900 నుంచి రూ. 47,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 13 – రూ. 59,900 నుంచి రూ.59,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 14 – రూ.69,900 నుంచి రూ. 69,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 14 ప్లస్ – రూ.79,900 నుంచి రూ.79,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 – రూ.79,900 నుంచి రూ.79,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 ప్లస్ – రూ.89,900 నుంచి రూ.89,600కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 – రూ.1,34,900 నుంచి రూ. 1,29,800కి తగ్గింపు
ఐ-ఫోన్ 15 ప్రో మ్యాక్స్ – రూ. 1,59,900 నుంచి రూ.1,54,000కి తగ్గింపు