Donald Trump: పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆ ఘటనలో ప్రస్తుతం ఎఫ్‌బీఐ దర్యాప్తు చేపడుతోంది. అయితే ఆ దర్యాప్తులో భాగంగా ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ ఇంటర్వ్యూ చేయనున్నది. ఆ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ట్రంప్ అంగీకరించారు. కానీ ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందన్న తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ సాధారణ రీతిలోనే బాధిత వ్యక్తి ఇంటర్వ్యూ ఉంటుందని ఎఫ్‌బీఐ తెలిపింది. సంఘటన జరిగిన రోజున ఆయన కోణంలో ఎటువంటి అంశాలను గుర్తించారో తెలుసుకోనున్నట్లు ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ తెలిపారు. జూలై 13న జరిగిన దాడిలో ఎందుకు థామస్ మాథ్యూ క్రూక్స్ కాల్పులు జరిపాడన్న అంశాన్ని ఇంకా ఎఫ్‌బీఐ తేల్చలేకపోయింది.
interview
Dhruv Rathee On PM Modi: మోదీ పిరికివాడు, నియంత..యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సెన్సేషనల్ కామెంట్స్
Dhruv Rathee On PM Modi: ధ్రువ్ రాఠీ..ప్రముఖ యూట్యేర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. అందరూ చేసే వీడియోల్లాంటివి ఇతను చేయడు. ధ్రువ్ సోషల్, పబ్లిక్ ఇంట్రస్ట్ విషయాలు, రాజకీయాలు, నేతలు ఇలాంటివి వాటికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడతాడు. భారతదేశం, ఇతర ముఖ్య దేశాల గురించి కూడా కామెంట్స్ చేస్తుంటాడు. ధ్రువ్ చెప్పేది ఎంతటి బిగ్ సాట్ అయినా అస్సలు మొహమాటపడడు. ప్రధాన మోదీనే కోవార్డ్ అంటూ కామెంట్ చేశాడు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ చాలా స్ట్రాంగ్ వీడియో చేశాడు. ఈ యూట్యూబర్‌ను తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ప్రధాని మోదీ గురించి ధ్రువ్ రాఠీ సంచలన కామెంట్స్ చేశారు.
ప్రధాని మోదీ ఒక నియంత, పిరికిపంద అంటున్నారు ధ్రువ్ రాఠీ. దేశంలో జరుగుతున్న అన్యాయాలు చూస్తే ఈ విషయం అర్ధమవుతుందని చెబుతున్నారు. మోదీ పాలనలోకి వచ్చినప్పటి దగ్గర నుంచీ ఇప్పటి వరకు ఏ దేశంలో జరగనవన్నీ మన దేశంలో జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. మన దేశం నియంత పాలనలోకి జారుకుంటోందని కామెంట్ చేశారు. దానికి ఉదాహరణగా 2014 నుంచి 2019 మధ్యలో జర్నలిస్ట్‌ల మీద జరిగిన అటాక్‌లను చెప్పుకోవచ్చని చెబుతున్నారు. ఆ నాలుగేళ్ళల్లో 198 మంది జర్నలిస్ట్‌ల మీద అటాక్ జరిగితే అందులో 40 మందిని చంపేశారని లెక్కలతో సహా చెప్పారు. ఇదొక్క విషయం చాలు మోదీ ఏంత నియంతో చెప్పడానికి అంటూ కుండ బద్ధలు కొట్టినట్టు మాట్లాడారు.
కానీ ఇంత జరుగుతున్ని ఎందుకు భారతదేశ ప్రజలు మోదీనే మళ్ళీ కావాలనుకుంటున్నారని సర్వే ల్లో వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా…ధ్రువ్ ఇలా చెప్పుకొచ్చారు. ఈ సర్వేలను అస్సలు నమ్మకూడదు అంటూ చెబుతున్నారు. సర్వేల్లో మనం అడిగిన ప్రశ్నలబట్టి జవాబులు వస్తాయి. దేశంలో చాలా 70 పర్శంట్ జన్ మోదీకి వ్యతిరేకంగా ఉ్నారు. కానీ సర్వేల్లో ఆ విషయం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే వారు అడిగిన ప్రశ్నలు అలానే ఉంటాయి అని అంటున్నారు. దేశాన్ని మోదీ నుంచి, నియంతృత్వం నుంచి కాపాడాలంటే ఒక్కటే ఒక్క ఆయుధం ఉందని…అదే ఓటు హక్కు అని చెబుతున్నారు. ఈసారి అయినా ప్రజలు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి తమ వ్యతిరేకతను చాటాలని ధ్రువ్ చెబుతున్నాడు. ఇలానే దేశం ఉంటే చాలా అన్యాయాలు జరుగుతాయని చెబుతున్నారు.
BIG BREAKING 🚨
Dhruv Rathee gave brutal bélt trèatment to Modi in his latest interview with Karan Thapar ⚡
He called Modi a 𝗯𝗶𝗴 𝗰𝗼𝘄𝗮𝗿𝗱 & 𝟴𝟬% 𝗱𝗶𝗰𝘁𝗮𝘁𝗼𝗿 and made an appeal to throw him out to save our country.
Don’t miss this explosive interview, Must watch &… pic.twitter.com/pwV1c6Erne
— Ankit Mayank (@mr_mayank) April 10, 2024
Also Read:డీఎంకే తమిళనాడును లూటీ చేస్తున్న ఓ కంపెనీ.. పీఎం మోదీ సెన్షేషనల్ కామెంట్స్!
PM Modi : ఎలక్టోరల్ బాండ్లు ఎదురు దెబ్బ ఎలా అవుతుంది-ప్రధాని మోదీ
Modi On Electoral Bonds : ఈరోజుల్లో ఎన్నికల బాండ్లు(Electoral Bonds) చాలా అవసరం అంటున్నారు ప్రధాని మోదీ(PM Modi). దీని వలన ఎవరెవరు, ఎవరెవరికి విరాళాలు ఇస్తున్నారో తెలుస్తుంది అని చెబుతున్నారు. ఇదొక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం అని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఈ అవకాశం లేదని అన్నారు. నిన్న ఒక తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల మీద మోదీ స్పందించారు. దీనికి పంచెకట్టులో ప్రధాని మోదీ(PM Modi) ఈ ఇంటర్వ్యూకి హాజరు కావడం ఆకర్షణగా నిలిచింది.
లోపం లేకుండా ఏ వ్యవస్థా ఉండదు.. బాండ్ల వ్యవహారంలో ఎవరైనా ఎదరు దెబ్బ ఎలా తింటారు అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. అంత ఇబ్బందికర పరిస్థితులు ఏం ఎదురయ్యాయో చెప్పాలని అడిగారు. విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరికి వెళ్తున్నాయి అనేది ఎలక్టోరల్ బాండ్ల వల్లే తెలుస్తోంది. 2014కి ముందు ఏ పార్టీకి ఎంతెంత విరాళాలు వచ్చాయో ఏ దర్యాప్తు సంస్థలు కూడా చెప్పలేవు. ప్రతీ పనిలో రాజకీయాలు చూడకూడదు. కొన్ని దేశం కోసం కూడా చేస్తామని అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు గంతులు వేస్తూ గర్వపడుతున్నవారు తర్వాత పశ్చాత్తాపడతారని అన్నారు.
తాను రాజకీయనాయకుడు(Political Leader) అయినంత మాత్రాన కేవలం ఓట్ల కోసమే అన్ని పనులూ చేస్తానని అనుకోకూడదు. అలానే అయితే ఈశాన్య రాష్ట్రాలకు తాము అన్ని పనులు చేసి ఉండకూడదని చెప్పుకొచ్చారు. అందరి కన్నా తానే అక్కడకు ఎక్కువసార్లు వెళ్ళానని చెప్పారు ప్రధాని మోదీ. ఇక తమిళ ఓటర్లు ఈసారి తమకు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో విపరీతమైన సామరధ్యం ఉంది..దానిని వృధా చేయడం మాకు ఇష్టం లేదు. వికసిత్ భారత్ అంటే దూఏశంలో ప్రతీ మూల అభివృద్ధి చెందడమే అని చెప్పుకొచ్చారు. తమిళనాడు కూడా ఇందుకు ఓ కేంద్రంగా మారుతుందని నేను భావిస్తున్నా. ఇక్కడి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అద్భుతంగా పని చేస్తున్నారు’’ అని ప్రధాని మోదీ కితాబిచ్చారు.
Also Read : Supreme Court : జ్ఞానవాపి మసీదులో పూజలు..నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
Movies : కార్లంటే ఇష్టం అన్నా అంతే లాంబోర్గిని ఇచ్చేశాడు.. ప్రభాస్ గురించి చెప్పిన పృథ్వీరాజ్
Prithviraj : ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న సలార్(Salaar) సినిమా రేపు థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే అన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిపోయి…బుక్ మై షో క్రాష్ కూడా అయిపోయింది. మొదటి రోజే వంద నుంచి 150 కోట్ల వరకు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. ఓవర్సీస్లో ప్రీ బుకింగ్స్‌తోనే మిలియన్ల క్లబ్బులోకి జాయిన్ అయిపోయింది సలార్. ప్రస్తుతం దేశమంతా సలార్ ఫీవర్ కనిపిస్తోంది.
Also read:అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం
సలార్ రేపు విడుదల అవుతోంది. అయితే అన్ని సినిమాలకు చేసినట్టు దీనికి మాత్రం టీమ్ పెద్దగా ఏమీ ప్రమోషన్స్ చేయలేదు. కేవలం ప్రశాంత్ నీల్, ప్రభాస్(Prabhas) కాంబినేషన్ మీదనే అంచనాలు అన్నీ బిల్డప్ అయ్యాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్ లు సినిమా మీద మరింత అంచనాలు పెంచేసాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ట్రైలర్ ఈవెంట్లు, మీడియాతో ఇంటరాక్షన్స్ వంటివి ఏమీ చేయలేదు కానీ రాజమౌళితో సలార్ టీం ఓ ఇంటర్వ్యూ మాత్రం చేసింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్‌లతో రాజమౌళి చేసిన ఈ ఇంటర్వ్యూ ఇది.
ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ ముందు 45 రోజులే షూటింగ్ అని హోంబలే ఆఫర్ ఇచ్చిందని.. అంతేకదా అని ఒప్పేసుకుందాం అనుకున్నానని చెప్పాడు. ఒక్కో సినిమాకు 5, 3 ఏళ్లు పని చేస్తున్నా కదా.. ప్రశాంత్ నీల్‌తో సినిమాను చేయను అని నో చెబితే ఫ్యాన్స్ చంపేస్తారని అనుకున్నానని అంటున్నాడు డార్లింగ్. అందుకే ఎలాగైనా సరే నాగ్ అశ్విన్‌ను ఒప్పించి.. డేట్లు అడ్జస్ట్ చేసి సలార్‌కు ఓకే చెప్పానని ప్రభాస్ అన్నాడు.
ఇక ఇందులో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పృథ్వీరాజ్ మాట్లాడుతూ ప్రభాస్ తో పొరపాటున కూడా ఏ మాటా అనకూడదని అంటున్నాడు. మామూలుగా అన్న విషయాలను కూడా సీరియస్ తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు. తన కూతురితో మాట్లాడుతూ తనకి ఏ ఫుడ్ ఐటెమ్స్ ఇష్టమో అడిగాడు. నాకూతురు ఏవో లిస్ట్ చెప్పింది. అంతే ప్రబాస్ అవన్నీ పంపించేవాడు. వాటిని పెట్టుకోవడానికి మరొక రూమ్ తీసుకోవాల్సి వచ్చిందని అని చెప్పకొచ్చాడు పృథ్వీ. దీని కంటే హైలెట్ స్త్రంటి అంటే ఒకసారి ప్రభాస్ తో నాకు కార్లు అంటే ఇష్టం అని చెప్పా…అంతే తన లంబోర్గిని కార్ తీసుకొచ్చి ఇచ్చేశాడు. షూటటింగ్ జరిగిననన్నాళ్ళు వాడుకోమని ఇచ్చేశాడు. ఇలా ప్రభాస్ ప్రేమతో చంపేస్తాడని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో తమ ఇద్దరి మధ్యా స్నేహం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపాడు.
BJP Laxman Interview: జంప్ జిలానీలు పాసింగ్ క్లౌడ్స్ లాంటివారు-కే.లక్ష్మణ్
BJP Laxman Interview: ఓట్ల కోసం తాయిలాలు ఇచ్చే పార్టీ మాది కాదు. పేదల కన్నీరు తుడిచే పార్టీ మాది అంటున్నారు తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్. మోదీ (Modi) నిజాయితీ, ప్రజల కోసం ఆయన చేస్తున్న పనులను అందరూ గమనిస్తున్నారని…ఆ నమ్మకంతోనే జనం బీజేపీకి ఓటు వేస్తారని అన్నారు. ఈసారి తెలంగాణలో (Telangana Elections) తమ పార్టీ గట్టి పోటీనిస్తుందని తెలిపారు. అదేవిధంగా పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోవడం చాలా సహజమని లక్ష్మణ్ కొట్టిపారేశారు. దాన్ని అంత సీరియస్ గా తీసుకోనక్కర్లేదని అన్నారు. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాంటి వారని వ్యాఖ్యానించారు. బీజెపీ నుంచి వెళ్ళిపోతున్నవారితో పార్టీకి ఏమీ సంబంధం లేదు. అన్ని పార్టీల్లో ఇది జరగుతోంది. కొంత మంది వెళ్ళిపోతే మరి కొంత మంది వచ్చి చేరుతున్నారన్నారు. బీజెపీ (BJP) మొదట ప్రకటించిన లిస్ట్ లో చాలా మంది కొత్తవాళ్ళే ఉన్నారు. మేము అందరికీ సమన్యాయం జరిగేట్టు చూస్తున్నాం. బాబూ మోహన్, విజయశాంతి వంటి వారి విషయాల్లో కూడా అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని లక్ష్మణ్ తెలిపారు. సెకండ్ లిస్ట్ నవంబర్ 1కు వస్తుందని చెప్పారు.
Also read:బీఆర్ఎస్లోకి పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్
బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) డీఎన్ఏ ఒకటే. వాళ్ళిద్దరూ ఎప్పటికైనా కలుస్తారు. ఎవరికి ఓటేసినా ఒకటే. బీజెపీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను సపోర్ట్ చేయదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో జనసేన (Janasena), బీజెపీ కలిసి పోటీ చేస్తాయి. దీని మీద త్వరలోనే ఒక అభిప్రాయనికి వచ్చి ఎన్ని స్థానాల కోస్ జనసేన పోటీ పడుతుంది అనేది ప్రకటిస్తామని తెలిపారు. టీడీపీతో కలుస్తామన్న వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. జనసేన వేరే రాష్ట్రంలో టీడీతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని అన్నారు.
Also Read: 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకే పోలింగ్
Telangana Politics: శ్రీనివాస్ గౌడ్ ఏ కార్డు ప్లే చేసినా.. ఓడిస్తా: యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అభివృద్ది మాటున అరాచకం జరుగుతుందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు నిశ్చయించుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందని.. బీఆర్ఎస్ పార్టీలో ఆ పరిస్థితి లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం మాత్రమే తెలంగాణను శాసిస్తోందని ఆరోపించారు. బీసీలకు ఆదరణ లేని పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చేశాడని.. అందుకే కేసు వేశామన్నారు.
ప్రజలు మార్పు కావాలంటున్నారు..
ప్రగతి భవన్ కోట తలుపులు తట్టెందుకు కూడా ఎవరికీ అవకాశం లేదన్నారు. ఈటెల రాజేందర్ లాంటి వారికి కూడా అనుమతి లభించని రాచరిక పాలనను చూశామన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరినట్లు స్వయంగా ప్రధాన మంత్రే చెప్పారన్నారు. బీఆర్ఎస్ పాలన ఉన్నన్ని రోజులు కేసీఆర్, తర్వాత కేటీఆర్, హిమన్షు వీళ్ళే ఉంటారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డు ప్లే చేసినా.. ఏ కార్డు ప్లే చేసినా ఓడించేందుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధమయ్యారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి..
ఇది కూడా చదవండి: మెడమీద తలకాయ ఉన్నవాళ్లు బీఆర్ఎస్కి ఓటు వేయరు: బండి సంజయ్