Actress Bhavana Interview : మహాత్మ, ఒంటరి, హీరో, వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ భావన(Bhavana). ఆ తర్వాత కొన్నాళ్ళకు టాలీవుడ్(Tollywood) కి దూరమైంది. మలయాళంలోనే వరుస అవకాశాలతో కెరీర్ సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్న టైం లోనే ఓ వివాదంలో చిక్కుకొని ఏకంగా కిడ్నాప్ కి గురై సంచలనాన్ని రేపింది.
మలయాళ నటుడు దిలీప్ తన భార్య దూరం కావడానికి భావనే కారణమని డబ్బులిచ్చి మరీ ఆమెపై లైంగికంగా దాడి చేయించాడు. అప్పట్లో ఈ న్యూస్ సినీ పరిశ్రమనే కుదిపేసింది. ఇదిలా ఉంటే భావన లాంగ్ గ్యాప్ తర్వాత మలయాళంలోకి రీ ఎంట్రీ ఇస్తుంది. భావన తాజాగా ‘ఎన్టికక్కకురు ప్రేమందార్న్’, ‘నడిగర్’ అనే సినిమాల్లో నటించింది. వీటిలో ‘నడిగర్’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Also Read : ప్రభాస్ ‘కల్కి’ లో మరో స్టార్ హీరో.. ఫ్యాన్స్ కి పండగే!
అవన్నీ విని విసిగిపోయా
తాజా ఇంటర్వ్యూ లో యాంకర్ మీ కెరీర్ లో ఎదుర్కొన్న గాసిప్స్ గురించి చెప్పమని అడిగితే.. అందుకు భావన జవాబిస్తూ.. ” నేను చచ్చిపోయానని, అబార్షన్ చేయించుకున్నానని, కొచ్చిలో అబార్షన్ చేయించుకున్నట్టు, అబార్షన్ చేయించుకొని చనిపోయినట్లు ఇలా చాలానే విన్నా. ముఖ్యంగా అబార్షన్ గాసిప్స్ విని విసిగిపోయా. పెళ్ళికి ముందు ఇలాంటి రూమర్స్ విన్నప్పుడల్లా మానసికంగా ఎంతో క్రుంగిపోయేదాన్ని. కానీ పెళ్లి తర్వాత భర్త సపోర్ట్ తో బలంగా మారిపోయా” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక భావన నటించిన నడిగర్ విషయానికొస్తే.. మలయాళ అగ్ర హీరో టోవినో థామస్ ఇందులో హీరోగా నటించాడు. లాల్ జూనియర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, ధ్యాన్ శ్రీనివాసన్, బాలు వర్గీస్, అనూప్ వీరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో మలయాళ ఇండస్ట్రీ(Malayalam Industry) లో అడుగుపెడుతున్నారు.