Ganta Srinivasa Rao: విశాఖలో వైసీపీ భూదందాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్ ఫైల్స్ తరహాలో త్వరలోనే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. విశాఖ భూ ఆక్రమణల్లో సీఎస్ స్థాయిలో పనిచేసిన వ్యక్తులున్నారని ఆరోపించారు. కొత్తగా ఆక్రమణలకు తావులేకుండా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధిపైనే సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao: మా మొదటి ప్రాధాన్యత ఇదే.. 6 నెలల్లో ఇళ్లు పూర్తి చేస్తాం: గంటా శ్రీనివాసరావు
Ganta Srinivasa Rao: ఎన్నికల్లో ఎన్నడూ లేని ఘన విజయాన్ని కూటమి సాధించిందన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గత 5 ఏళ్లలో రాష్ట్రం గాడి తప్పిందని.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గాడిలోకి పెట్టడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం మొదటి సంతకం మెగా డీఎస్సీపై సంతకం పెట్టారన్నారు. 2014-19 బాబు హయంలో అమరావతి, పోలవరంతో పాటుగా పేద వాడికి ఇల్లులు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. పెద్ద పెద్ద కంపిణీలకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. 3360 ఇళ్లులు భీమిలి నియోజకవర్గంలో నిర్మించడం జరిగిందని తెలిపారు. ఇవి మూడు కేటగిరిలో నిర్మించారన్నారు.
Also Read: ప్లీజ్.. మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి.. వాలంటీర్ల ఆందోళన.!
అయితే, 2019లో ప్రభుత్వం మారడం దురదృష్టకరమని.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇల్లులను పూర్తిగా మరిచారని కామెంట్స్ చేశారు. వీటితో పాటు అన్న క్యాంటీన్లు కూడా మూసివేశారని వెల్లడించారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఇల్లులు అలానే ఉన్నాయన్నారు. మళ్ళీ 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇల్లులు లబ్దిదారులకు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనతో పాటుగా అధికారులు కూడా ఈరోజు సందర్శించడం జరిగిందన్నారు. దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వం లబ్దిదారులను లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేసిందన్నారు.
Also Read: ఇరిగేషన్ వ్యవస్థ నిర్వీర్యం.. సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు: ఎస్సీ రాంబాబు
వీటితో పాటు హుద్ హుధ్ తో పాటు సినీ ఇండస్ట్రీ వాళ్ళు నిర్మించిన వాటిని కూడా నిజమైన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు సందర్శించిన ఇల్లులు సర్వే నెంబర్ 114… 6 ఎకరాల్లో 8 బ్లాక్స్ లు 380 యూనిట్లు నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటికీ 77 రిజిస్ట్రేషన్ కూడా జరిగాయన్నారు. హౌసింగ్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం కూటమి లక్ష్యమని.. 6 నెలల్లో వీటిని పూర్తి చేసి లబ్ధరులకు అందజేస్తామని తెలిపారు. నిజమైన లబ్దిదారులకు చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నార్త్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ ఇల్లు లు ఇచ్చారని కొంతమంది రావడం జరిగిందన్నారు. ఎవరైతే అన్యాయంగా వచ్చారో వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TDP Ganta: ఉత్తరాంధ్రలో ఇన్ని సీట్లు గ్యారెంటీ.. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా చేస్తోంది..!
TDP Ganta Srinivasa Rao: విశాఖపట్నంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. భారీ మెజార్టీతో కూటమి ఘటన విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో 34 సీట్లలో కనీసం 30 సీట్లు సాధిస్తుందన్నారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయని.. జూన్ 9వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. వైసీపీ కంచుకోటలో కుసాలు కదిలిపోతున్నాయన్నారు.
Also Read: అలా అనడానికి సిగ్గులేదా.. పవన్ పై రెచ్చిపోయిన ముద్రగడ..!
ఓటమి భయంతోనే..
ఈ క్రమంలోనే సీఎం రమేష్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, వారి అనుచరులు వెంటపడి కార్లు ధ్వంసం చేసి దాడి చేశారన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. జగన్ ఫ్రస్టేషన్ కి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. ఎన్నికల కమిషన్ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బ్యాలెన్స్ చేస్తాం..
కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సంక్షేమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అని.. సంపద సృష్టించడం తోపాటు సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను.. అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామన్నారు. భీమిలి నియోజకవర్గం లోకల్ మేనిఫెస్టో త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పొత్తు అని.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటాకు మరో షాక్
Ganta Srinivasa Rao: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకి మరో షాక్ తగిలింది. ఈ సారి గంటాకు ఇండియన్ బ్యాంక్ ఝలక్ ఇచ్చింది. గ౦టాకి చెందిన ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఈ నెల 25న వేల౦ నిర్వహించనున్నారు బ్యాంకు అధికారులు. ప్రత్యూష కంపెనీలోని తొమ్మిది రకాలైన ఆస్తులకు వేలం జరగనుంది. గతంలో రూ. 248 కోట్ల రూపాయల మేర ప్రత్యూష క౦పెనీ బ్యాంక్ రుణం తీసుకుంది.
ALSO READ: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్
ఆ లోన్ తాలూకా వడ్డీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. మెుదటిసారిగా 2006 అక్టోబర్ 4న రుణ౦ చెల్లి౦చాల౦టూ బ్యాంకు కంపెనీకి నోటీసులు జారీ చేసింది. సమాధానం రాని క్రమంలో.. 2006 డిసెంబర్ 27న, తిరిగి 2017 ఫిబ్రవరి 21న బ్యాంకులో ప్రత్యూష కంపెనీ కుదవ బెట్టిన ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని కీలకమైన ప్రాంతాలలో ఉన్న భవనాలు, రుషికొండ వద్ద ఉన్న స్థలాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.
మరోవైపు టీడీపీ షాక్..
అభ్యర్థుల ప్రకటనలో సీనియర్లకు టీడీపీ (TDP) హైకమాండ్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి, కీలక నేత దేవినేని ఉమను (Devineni Uma) పక్కనపెట్టింది. థర్డ్ లిస్ట్ లో మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించారు. దీంతో దేవినేని ఉమకు సీటు లేనట్లేనని తేలిపోయింది. పెనమలూరులో బోడె ప్రసాద్ కు కేటాయించారు చంద్రబాబు (Chandrababu). మరో కీలక నేత గంటా శ్రీనివాసరావుకు కూడా షాక్ ఇచ్చింది టీడీపీ నాయకత్వం. ఈ రోజు విడుదలైన 3వ జాబితాలోనూ ఆయన పేరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెందుర్తిలోనూ బండారు సత్యనారాయణమూర్తికి షాక్ ఇచ్చారు. ఆయన పేరు కూడా లిస్ట్ లో లేదు.
ఇంకా.. మాజీ మంత్రి, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కూడా సీటు కేటాయించలేదు చంద్రబాబు. పెండింగ్‌లోనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పాలకొండ సీట్లను ఉంచడం అక్కడి నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విశాఖపట్నం పెందుర్తి, భీమిలి సీట్లను కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంచారు చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో దర్శి, కడప జిల్లాలో రాజంపేట, బద్వేల్ టికెట్లు కూడా పెండింగ్ లో ఉంచారు.
EX Minister Ganta: సీటు విషయం తేల్చుకునేందుకు చంద్రబాబును కలిసిన గంటా!
Ex Minister: ఏపీలో(AP) ఎన్నికలు (Elections)వస్తున్న తరుణంలో సీనియర్ నేతలు చాలా మంది తమ సీట్ల విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు కావాలనుకుంటున్న కొందరు నేతలు బుధవారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
చంద్రబాబును (CBN) కలిసిన వారిలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) , పి నారాయన ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి చంద్రబాబును కలిశారు. విశాఖ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనను చీపురుపల్లి నుంచే పోటీ చేయమని చెబుతున్నారు. కానీ చీపురుపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
చంద్రబాబు ముందు నుంచి కూడా గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయమని చెబుతున్నారు. అయితే గంటా మాత్రం అక్కడ నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపడం లేదు. నిన్న కూడా చంద్రబాబును కలవగా ఆయన అదే మాట చెప్పారు. అయితే ఈ విషయం గురించి గంటా తన తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ విషయం గురించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. గంటా టీడీపీని వీడేందుకు రెడీ అయ్యారని కొందరు అంటుంటే.. కొందరు మాత్రం అయిష్టంగా అయినా సరే ఆయన టీడీపీలోనే ఉంటారని అంటున్నారు.
తన రాజకీయ భవిష్యత్తు కోసం గంటా తీసుకునే నిర్ణయం ఏంటి అనేది మాత్రం తెలియలేదు. చీపురుపల్లిలో పోటీ గురించి గంటా గురువారం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.కొద్దిరోజుల క్రితం గంటా ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించారు. విశాఖ నుంచి సీఏంగా ప్రమాణస్వీకారం చేస్తానని, ఇక్కడే ఉంటానని సీఏం జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోషల్ మీడియాలో స్పందించారు.
అదిగో వస్తా.. ఇదిగో వస్తానని చెబుతూ ఐదేళ్లు కాలం వెళ్లదీశారని విమర్శలు గుప్పించారు. ‘నెలలో వస్తా.. సంక్రాంతి కి వస్తా.. ఉగాదికి వస్తా..’ అంటూ ఐదేళ్ళ అంకం ముగిసిపోయిందని చురకలు వేశారు.‘మీరు రేపు గెలిచేది లేదు.. ప్రమాణస్వీకారానికి వచ్చేది లేదని’ అంటూ గంటా కౌంటర్ వేశారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ గా ఉన్న విశాఖను సీఏం జగన్.. ‘సిటీ ఆఫ్ డేంజర్’గా మార్చేశారని విమర్శలు గుప్పించారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే విశాఖను రాజధాని పేరిట రణరంగ క్షేత్రంగా మార్చారని ఫైర్ అయ్యారు
Also read: మిస్సైన విద్యార్థినులను పట్టుకున్న పోలీసులు!
Ganta Srinivasa Rao: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
Ganta Srinivasa Rao: ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని పార్టీ ప్రపోజల్ పెట్టిందని.. అయితే, చీపురుపల్లి నుంచి పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నానని అన్నారు. గతంలో పోటీ చేసిన విశాఖ నుంచే పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. చీపురుపల్లి తనకు 150కిలో మీటర్ల దూరం అని..పైగా జిల్లా కూడా వేరు కాబట్టి ఆలోచిస్తున్నానని గంటా అన్నారు. చీపురుపల్లి అనేది తనకు సర్ప్రైజ్ అని వ్యాఖ్యానించారు. సన్నిహితులతో బాగా చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
Also Read: విజయవాడలో ఉద్రిక్తత.. షర్మిల అరెస్ట్?
ఇదిలా ఉండగా బొత్సను ఓడించేందుకు టీడీపీ ‘ఆపరేషన్ చీపురుపల్లి’ చేపట్టింది. బొత్సకు చెక్ పెట్టేందుకు గంటానే కరెక్ట్ అంటోంది టీడీపీ. అయితే, నియోజకవర్గంలో మరోమారు సర్వే తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చీపురుపల్లి నుంచి మూడు సార్లు విజయం సాధించిన బొత్స.. గత ఎన్నికల్లో 27 వేల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
Also Read: అరే ఏంట్రా ఇదీ.. మళ్ళీనా! డ్రగ్స్ కేసులో షణ్ముఖ్ అరెస్ట్!
చీపురుపల్లి నియోజకవర్గానికి 9 సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు విజయం సాధించింది టీడీపీ. మరి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తుందా? లేదంటే బొత్స నే గెలుస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వచ్చే ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ హోరాహోరీగా ప్రచారాలు చేపట్టాయి. విజయం మాదంటే మాదంటూ ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.