Jagan: హైదరాబాద్ లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏపీ మాజీ సీఎం జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. కన్వర్ట్‌డ్ క్రిస్టియన్ అయిన జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిసిన రాజాసింగ్.. జగన్ ప్రాచీన దేవాలయాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్‌డ్ క్రిస్టియన్‌ను టీటీడీ చైర్మన్‌గా చేసి మాంసం, మందు కొండపైకి తరలించి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Hyderabad: రచ్చకెక్కిన వివాహేతర సంబంధం.. తండ్రిని చితకబాదిన కొడుకులు, తల్లి!
‘జగన్ పాలనలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించి ప్రజలు ఓడించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు తిరుమలలో అధర్మమైన పనులు చేస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. తిరుమలలో ఎలా అయితే ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పారో.. అలాగే శ్రీశైలంలో కూడా హిందూ ధర్మ వ్యతిరేకుల రాజ్యమేలుతున్నారు. ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్నే ప్రచారం చేసేలా చూడాలి. హిందువులకు మాత్రమే ఆలయాల్లో ఉద్యోగాలు, చైర్మన్, బోర్డు మెంబర్లు ఇవ్వాలంటూ రాజాసింగ్ డిమాండ్ చేశారు.