Faima Response On Breakup With Praveen : జబర్దస్త్ కామెడీ షోలో మేల్ కమెడియన్స్ కి సమానంగా కొందరు లేడీ కమెడియన్స్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అందులో ఫైమా కూడా ఒకరు. పటాస్, జబర్దస్త్ లాంటి షోలలో తనదైన పంచులు, ప్రాసలతో కామెడీ క్వీన్ గా పేరు తెచ్చుకుంది ఫైమా. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి సైతం వెళ్ళింది.
అయితే జబర్దస్త్ లో తన తోటి కమెడియన్ ప్రవీణ్ తో ఫైమా ప్రేమలో ఉందని గతంలో వార్తలొచ్చాయి. ఈ ఇద్దరూ కలిసి రీల్స్ చేయడం, ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం లాంటివి చూసి ఆడియన్స్ సైతం ఇది నిజమని అనుకున్నారు. ఆలోపే ఈ ఇద్దరికీ బ్రేకప్ జరిగిందంటూ న్యూస్ వైరల్ అయింది. ఆ మధ్య ప్రవీణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఫైమా తన ప్రేమను రిజెక్ట్ చేసిందని చెప్పాడు. ఇక తాజాగా ఇదే విషయం పై ఫైమా స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
Also Read : సమంత సెమీ న్యూడ్ ఫొటోపై రచ్చ.. ఇదే నిజమైన విజయం అంటూ నటి పోస్ట్!
ఆ సమస్యల వల్లే దూరం
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైమా ప్రవీణ్ తో బ్రేకప్ గురించి స్పందిస్తూ.. ” టీవీ షోలలో కనిపించే జోడీలు ఏవీ నిజం కాదు. అవి నిజం అని నమ్మొద్దు. ప్రవీణ్, నన్ను ఆన్ స్క్రీన్ లో జోడిగా చూపించారు. దాంతో మా జంటను ఆడియన్స్ బాగా ఆదరించారు. దాన్ని వాడుకొని యూట్యూబ్ లో వీడియోలు చేశాం. నాకు,ప్రవీణ్ కి మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అవి ఇక్కడ చెప్పుకోలేం. అందుకే దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు”
నన్ను నెగిటివ్ చేస్తున్నారు
ఒకప్పుడు మా రిలేషన్, అండర్ స్టాండింగ్ అంతా బాగుండేది. కొన్ని విషయాల వాళ్ళ మా మధ్య దూరం పెరిగింది. అలాంటప్పుడు పర్సనల్ గా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి. అంతే కానీ అతనికి పేరెంట్స్ లేకపోవడంతో తాను మీడియా ముందు మాట్లాడే మాటలనే సింపతీకి దారి తీస్తున్నాయి. దాంతో అతను ఏం చెప్పినా విని జనాలు నన్ను నెగటివ్ చేస్తున్నారు. దయచేసి మా రిలేషన్ కి ఏ పేరు పెట్టకండి” అంటూ చెప్పుకొచ్చింది.