Etala Rajender: మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్న సందర్భంగా బీజేపీ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్ శుభాకాంక్షలు తెలిపాడు. పార్లమెంట్ ఫలితాలపై మీడియాతో మాట్లాడిన ఈటల.. నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధాని కాబోతున్న మోడీపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో బీజేపీ బలం భారీగా పెరిగింది. మొత్తంగా రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు 35 శాతానికి పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, సొంత జిల్లా సీటు కూడా పోయింది. ఎంత కష్టపడినా, పదుల సంఖ్యలో సభలు పెట్టినా రేవంత్ భంగపాటు తప్పలేదు. కేవలం కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారు. తమకు బాధ్యత గల ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇచ్చారు. దానిని సక్రమంగా నిర్వర్తిస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు ఊరుకోం. వెంటపడి మరీ అమలు చేయిస్తాం. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు.
Etala Rajender
Hyderabad: నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. రేవంత్‌కు ఈటల సవాల్!
Etala Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ పోటాపోటీగా అభ్యర్థులను ఎంపిక చేస్తూ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని మల్కాజ్‌గిరిలో ఎంపిగా స్థానికుడిని నిలబెట్టాలంటూ రేవంత్‌కు ఈటల సవాల్ చేశారు. నిజంగా దమ్ముంటే మల్కాజిగిరి ప్రాంతం వాడినే అభ్యర్థిగా నిలబెట్టాలని, బయటివాడిని నిలబెడితే సంగతి తేలుస్తానంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Malla Reddy: మల్లారెడ్డి కోడలుకు విద్యార్థుల కౌంటర్.. అంతా అవినీతే అంటూ క్యాంపస్ లో లొల్లి!
నీకు దమ్ముంటే అలా చేయ్..
ఈ మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ.. ‘మల్కాజ్‌గిరితో నాకు ఏలాంటి సంబంధం లేదని రేవంత్ చెబుతున్నాడు. మరి నీకేం సంబంధం ఉంది చెప్పు. ఈ సందర్భంగా ఒక ఛాలెంజ్ వేస్తున్నా.. నీకు దమ్ముంటే ఈ ప్రాంతం వాడినే మల్కాజ్‌గిరిలో పోటీ చేయించు. ఈ ప్రాంతంతో సంబంధం ఏమిటని అంటున్నావు కదా.. నీకు నిజంగా దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థిని నిలబెట్టు. బయటి వ్యక్తిని నిలబెడితే నీ సంగతి చెప్తాం’ అంటూ హెచ్చరించారు. అలాగే రేవంత్‌కు దమ్ము లేదని, మల్కాజ్ గిరీ అభ్యర్థి కోసం వెతుకులాడుతున్నాడంటూ ఆరోపించారు. అంతేకాదు రూ.200 కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థి కావాలని రేవంత్ చూస్తున్నాడన్న ఈటల.. తనను తట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖర్చు పెట్టేటోడు కావాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.
Telangana: బీఆర్ఎస్ ఒరవడిలోనే కాంగ్రెస్ బడ్జెట్.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana: తెలంగాణ మట్టిబిడ్డ పీవీ (PV) నరసింహారావు గారికి భారతరత్న పురస్కారంతో గౌరవించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి (Modi) తెలంగాణ ప్రజల తరఫున ధన్యావాదాలు తెలిపారు బీజేపీ మాజీ శాసనసభ్యులు ఈటల రాజేందర్ (Etala Rajender). బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీవీ నర్సింహారావు నిజాం నిరంకుశ వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగినప్పుడు నాగపూర్ కేంద్రంగా క్యాంపులో ఉండి పేదప్రజల కోసం తుపాకి పట్టుకుని పోరాడిన బిడ్డ అంటూ కొనియాడారు. విద్యార్థి దశలోనే ఆనాటి నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చి, చురుకుగా ఉద్యమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు.
తెలుగుజాతికి గర్వకారణం..
ఈ మేరకు పీవీ నర్సింహారావు ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్ధాలకు పైగా శాసనసభ్యులుగా పనిచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు దున్నేవారికే భూమి ఉండాలని భూసంస్కరణలను సమున్నతంగా అమలు చేసిన మహనీయుడు పీవీ. కరీంనగర్ జిల్లా వంగర గ్రామంలో వందల ఎకరాలు కలిగిన భూస్వామిగా ఉన్న ఆయన.. వందలాది ఎకరాల సొంత భూమిని పేదలకు పంచిపెట్టారని తెలిపారు. పీవీ బహుభాషా కోవిదుడు. ఇతర దేశాల్లోని భాషలను కూడా అవపోసన పట్టారన్నారు. ప్రధానమంత్రి అయిన వెంటనే దేశ ప్రజలు కష్టాలు తీర్చేలా భారత్ ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టేందుకు భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారని, భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల కోసం పీవీ మార్గదర్శనం చేశారని గుర్తు చేసుకున్నారు. అలాగే పీవీ నర్సింహారావు తనకు ఏ బాధ్యత కట్టబెట్టినా వన్నె తెస్తూ, మచ్చలేకుండా పాలన అందించారని పొగిడారు. పీవీ దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి కావడం తెలుగుజాతికి గర్వకారణమన్నారు.
పీవీ స్ఫూర్తిగా ఆచరణలో పునరంకితం కావాలి..
అయితే పీవీ నర్సింహారావు మరణించిన సమయంలో అంత్యక్రియల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం గౌరవించలేదంటూ విమర్శలు గుప్పించారు. పీవీ చేసిన సేవలకు గుర్తింపునివ్వని పార్టీ, అవమానించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పీవీగారికి భారతరత్న పురస్కారంతో గౌరవించడం భారతజాతికే గర్వకారణని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి గుర్తింపు దక్కినట్లుగా భావిస్తున్నామని, మనమంతా పీవీ స్ఫూర్తిగా ఆచరణలో పునరంకితం కావాలని కోరారు.
బడ్జెట్ గురించి మాట్లాడుతూ..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది. అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు. బడ్జెట్ అంచనాలకు, ఖర్చుకు సంబంధం లేకుండా పోతుందంటూ ఏకరువు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒరవడిలోనే కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022-23 బడ్జెట్ లో రూ. 2,56,958.51 కోట్లుగా ప్రతిపాదిస్తే.. రివైస్డ్ బడ్జెట్ రూ. 2 లక్షల 30 వేల కోట్లుగా అంచనా వేశారు. ఖర్చు చేసింది కేవలం రూ. 2లక్షల 4 వేల 500 కోట్లు మాత్రమే. 2022-23 బడ్జెట్ 1/5వ వంతు రియాల్టీకి దూరంగా ఉందన్నారు. 66 వేల కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చుపెట్టబోమని చూపించారని, అంటే అంకెలు తప్ప ఆచరణలో ఖర్చు ఉండదని చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.2,75,891 కోట్లలో 40 వేల కోట్లకు పై చిలుకు ఖర్చు పెట్టే ఆస్కారం లేదన్నారు ఈటల.
ఇది కూడా చదవండి : Rakul Preet Singh: ‘రామాయణం‘లో శూర్పణఖగా రకుల్..సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న బ్యూటీ..!!
హామీల అమలు ఉత్తదే..
ఇక కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే.. రూ. 5 లక్షల కోట్లు ఖర్చు పెడితేనే హామీలు అమలయ్యేలా కనపడుతున్నాయని చెప్పారు. బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు మాత్రమే కేటాయించారని, రైతుబంధు (భరోసా) కోసం రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇవన్నీ అమలు చేయాలంటే ఈ బడ్జెట్ ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. రుణమాఫీ ఈ సంవత్సరం ఉంటుందా? లేదా? స్పష్టత ఇవ్వలేదన్నారు. అంటే రైతులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు ఉత్తదేనని ఆరోపించారు. రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 ఆర్థిక సాయం ఇస్తమని కాంగ్రెస్ ప్రకటించిందని, వితంతువులకు, ఒంటరి మహిళలకు రూ.4 వేల చొప్పున ప్రతినెలా ఇవ్వాల్సి ఉందని, అయితే బడ్జెట్ లో మాత్రం ఎక్కడా నిధులు కేటాయించలేదంటూ ప్రస్తావించారు.
ఆ స్పష్టత ఇవ్వలేదు..
ఇచ్చిన హామీలు అమలు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగికి రూ. 4 వేలు ఇస్తామనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రస్తావించలేదు. కాంగ్రెస్ బడ్జెట్ చూస్తే ప్రజలు నవ్వుకునేలా ఉంది తప్పితే.. వారి ఆశలు నెవరేర్చేలా లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 66 అంశాలు ప్రస్తావించారు.రాష్ట్రంలో 52 శాతం ఉన్న బీసీ ప్రజానీకానికి ప్రతి సంవత్సరం రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లకు గాను లక్షకోట్ల రూపాయలు ఖర్చు పెడతామని కాంగ్రెస్ చెప్పింది. అయితే, బడ్జెట్ లో కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించిన్రు.బడ్జెట్ ను చూస్తే బీసీల అభ్యున్నతి కోసం రూపాయి ఖర్చు పెట్టే ఆస్కార లేదని ఆయన అన్నారు.
బడ్జెట్ లో కేటాయింపులు ఏవి?
బిహార్ వంటి రాష్ట్రాల్లో బడ్జెట్ లో 15 శాతం మేర విద్యకోసం ఖర్చు పెడుతున్నారని చెప్పారు. కాని 7శాతం నిధులు పెట్టారు. విద్యా రంగానికి పెట్టే ఖర్చులో కేవలం ఉద్యోగులకు జీతభత్యాలకు మాత్రమే నిధులు సరిపోతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కేటాయించిన తర్వాత.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఉపాధి లేక ఆటోలు నడుపుకునే దుస్థితి ఎదురైంది. ఆటో డ్రైవర్లు ఆదాయం రాక వేదనతో ఆటోలకు నిప్పంటించుకున్న ఘటనలు చూశాం. ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్ సంక్షేమం కోసం రూ. 12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కాని, బడ్జెట్ లో కేటాయింపులు ఏవి? అని ప్రశ్నించారు.
ప్రభుత్వం సమాధానం చెప్పాలి..
రాష్ట్రంలోని బెల్ట్ షాపులను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పింది. దానిపై స్పష్టత ఇవ్వడం లేదు. మహిళా గ్రూపులకు రూ. 10 లక్షల చొప్పున పావలా వడ్డీ రుణాలు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్.. బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. దళితబంధు, దళిత సబ్ ప్లాన్ అమలుకు బడ్జెట్ లో కేటాయింపుల్లేవు. దళితులకు రూ. 10 లక్షలు ఇస్తారా.. లేక బంద్ చేస్తున్నారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. హుజురాబాద్ తో పాటు మిగతా నియోజకవర్గాల్లో దళితబంధుకు నోచుకోని కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. గొల్ల కురుమలకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయంపై స్పష్టత కనపడటం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదు.ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్ , రాణి రుద్రమ, సునీత రెడ్డితో పాటు రాణా ప్రతాప్ పాల్గొన్నారు.
Etela Rajender: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే.. ఈటల సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ (Eatala Rajendar) మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) ప్రవర్తన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తనకు తానే చాలా గొప్ప వ్యక్తిగా ఊహించుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం మీట్ ది ప్రెస్ లో భాగంగా బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఈటల.. నిజాలెప్పుడూ కేసీఆర్ కు మింగుడు పడవని అన్నారు. వాస్తవాలను తెలుసుకునేందుకు కూడా ఆయనెప్పుడూ ఆసక్తి చూపించరంటూ ముఖ్యమంత్రి తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘కాళ్ల కింద భూమి కదులుతున్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదు. వాస్తవాలు చెబితే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారు. నీళ్లు, నియామకాల విషయంలో ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు’ అంటూ దుయ్యబట్టారు.
ఈ వార్త కూడా చదవండి: TS BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో లీక్.. సంచలన విషయాలివే!
అలాగే అభివృద్ధి పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందన్నారు. ఒక్క గజ్వేల్ లోనే 30వేల మంది కేసీఆర్ బాధితులున్నారని తెలిపిన ఈటల.. ముఖ్యమంత్రి అడుగులకు మడుగులు ఒత్తే వారికే బీసీ బంధు ఇప్పిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్, బీజేపీ ఒకటేననే ఆంశంపై కూడా స్పందించిన ఈటల..
‘బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తాను? బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ కలసి పోటీ చేయలేదు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారు. మా మధ్య ఏ ఒప్పందం లేదు. ఇవన్నీ ఆధారంలేని పుకార్లే’ అని కొట్టిపారేశాడు. చివరగా బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్న ఆయన.. హంగ్ వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Eatala Rajendar: కాళేశ్వరంతో లక్ష కోట్లు గంగ పాలు.. కేసీఆరే కారణం: ఈటల తూటాలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatala Rajendar) డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంతకు ముందు కట్టిన ప్రాజెక్ట్ లు ఏమీ దెబ్బ తినలేదన్నారు. కానీ కేసీఆర్ (KCR) ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం మూడు ప్రాజెక్ట్ లు దెబ్బతిన్నాయని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టుల కోసం సెలక్ట్ చేసిన సైట్ కరెక్ట్ కాదన్నారు. సాయిల్ టెస్ట్ కూడా సరిగా చేయలేదని ఆరోపించారు. ప్రాజెక్ట్ ను రికార్డ్ కోసం నిర్మించి, గొప్పలు చెప్పుకున్నారని మండిపడ్డారు. లక్ష్మి బ్యారేజ్ ను ఇసుక మీద కట్టారన్నారు. అన్ని పిల్లర్ లను చెక్ చేస్తే తప్పా.. ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనేది తేలుతుందన్నారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నీళ్లు వదలడంతో మోటర్లన్నీ కొట్టుకుపోయాయన్నారు. గొర్లు, బర్లు కూడా కొట్టుకు పోయాయన్నారు.
ఇది కూడా చదవండి: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!
ఆ స్థానంలో మనషులు ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా.. తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన మోడల్ ప్రకారం నిర్మించామని.. ఇది తమకు సంబంధం లేదని కాంట్రాక్టర్ లు అంటున్నారన్నారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు గంగ పాలు చేశాడని ధ్వజమెత్తారు ఈటల. దీనికి ప్రధాన కారకుడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు బండి సంజయ్. దీనికి బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష్మి బ్యారేజ్ కుంగి పోవడానికి కారణం డిజైన్ లోపమేనన్నారు.
సైన్స్ కి వ్యతిరేకంగా కాళేశ్వరం ప్రాజెక్టులను డిజైన్ చేశారని ధ్వజమెత్తారు. అన్ని విధాలుగా ఆ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం చెక్ చేస్తుందన్నారు. ఇది ఓ ఇంజనీర్ బ్లండర్ అని అన్నారు. కాళేశ్వరం పైన ఏరియల్ సర్వే చేశారు కానీ.. ఫిజికల్ సర్వే చేయలేదని రిటైర్డ్ ఐఏఎస్ రామ చంద్రుడు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లకు అనుమతులు రావడంలో తాను కూడా భాగస్వామినని అన్నారు. ఇంజనీర్లు కూడా కేసీఆర్ ఏది చెబితే అది ఒకే అన్నారన్నారు.
Etala Rajender: బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట
బీజేపీ పార్టీ రైతులకు పెద్దపీట వేయబోతోందని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ మేనిఫెస్టోలో రైతులకు ఉపయోగపడే అంశాలపై ఆలోచిస్తామన్నారు. అతి త్వరలో మంచి మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వెళ్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి వెళ్తుంటారని, కానీ ఎన్నికల అనంతరం ఇచ్చిన హామీల గురించి పట్టించుకోరని విమర్శించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న ఆయన.. విజయం సాధించిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేక పోయిందన్నారు. అక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ తెలంగాణలో గ్యారెంటీ కార్డులు ఇస్తే ప్రజలు నమ్ముతారా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎన్ని ఎత్తుగడలు వేసినా అధికారంలోకి రాదని ఈటల రాజేందర్ అన్నారు. మరోవైపు బీఆర్ఎస్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్ రాష్ట్రంలో పేదలకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదన్నారు. సీఎం దళితులకు ఓ స్కీమ్, బీసీలకు ఓ స్కీమ్ అంటూ కబుర్లు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అవినీతి బండారం బయట పడిందన్న ఈటల.. రానున్న రోజుల్లో అవినీతి సీఎంను ప్రజలు గద్దె దించుతారని స్పష్టం చేశారు. రుణమాఫీ డబ్బులు ఇచ్చేందుకు ఇంకా సమయం ఉన్నా సీఎం కేసీఆర్ ముందే టెండర్లను ఎందుకు పిలిచారని ఈటల ప్రశ్నించారు.
మరోవైపు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కావడం చాలా సంతోషంగా ఉందని ఈటల తెలిపారు. దేశ చరిత్రలో మొదటి సారి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందన్నారు. దీంతో చట్ట సభల్లో మహిళలకు అవకాశం దక్కనుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీన్ని బట్టి బీజేపీకి మహిళలపై ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని బిల్లులను ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.