ENG W vs IND W: ఇంగ్లండ్ మహిళా జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడిన భారత జట్టు సిరీస్ కోల్పోయి చివరి మ్యాచ్ లో విజయం సాధించింది. వరుసగా తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైన టీమిండియాకు చివరి మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో సాధించిన విజయం ఊరటనిచ్చింది. ఓ మాదిరి లక్ష్యంతో చేజింగ్ మొదలు పెట్టిన టీమిండియా 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి దాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (48; 48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోగా, జెమిమా రోడ్రిగ్స్ (29; 33 బంతుల్లో 4 ఫోర్లు) రాణించింది.
Amanjot Kaur hits the winning runs 👏#TeamIndia win the 3rd and last T20I by 5 wickets 🥳
England win the series 2-1
Scorecard ▶️ https://t.co/k4PSsXN2T6 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/yNlXmiKGu7
— BCCI Women (@BCCIWomen) December 10, 2023
భారత్ మొదట్లోనే షఫాలీ వర్మ వికెట్ కోల్పోయింది. ఫ్రెయా కెంప్ క్లీన్‌బౌల్డ్ చేసింది. తర్వాత రోడ్రిగ్స్‌తో జోడీ కట్టిన స్మృతి ఇన్నింగ్స్‌ను నడిపించింది. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాదారు. స్కోరు 50 దాటిన తర్వాత కాసేపటికే రోడ్రిగ్స్ డీన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ, హాఫ్ సెంచరీకి చేరువైన మంధాన వెంటవెంటనే వెనుదిరిగారు. ఆ వికెట్ పడగొట్టిన ఎక్లిస్టోన్ రిచా ఘోష్ ను బౌల్డ్ చేసింది. అయితే, చివర్లో అమన్‌జ్యోత్ కౌర్ రెండు బౌండరీలు బాదడంతో విజయం భారత్ జట్టును వరించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (6), అమన్‌జ్యోత్ కౌర్ (10) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఫ్రెయా కెంప్, సోఫీ ఎకిల్‌స్టోన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా, షార్లెట్ డీన్ ఒక వికెట్ తీసుకుంది.
ఇది కూడా చదవండి: ప్రమాదకరంగా పిచ్.. ఆరు ఓవర్లకే మ్యాచ్ క్యాన్సిల్!
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. బౌలర్లు రాణించడంతో ఇంగ్లండ్ 126 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో హెథర్ నైట్ (52; 42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా; అమీ జోన్స్ (25), సోఫీ డంక్లీ (11), షార్లెట్ డీన్ (16) పరుగులు చేశారు. మిగతా అందరూ ఒక అంకె పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ (3/19), సైకా ఇషాక్ (3/22), రేణుకా సింగ్ (2/3) రాణించి ఇంగ్లండ్ నడ్డి విరిచారు. చివరి ఓవర్లో అమన్‌జ్యోత్ కౌర్ ఇద్దరిని పెవిలియన్ కు చేర్చింది.
Celebrations in the camp after that close game 👌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/mk5p59yFrs
— BCCI Women (@BCCIWomen) December 10, 2023