Elaichi Benefits For High Blood Pressure: అధిక రక్తపోటు, అనేక ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు యాలకులు మేలు చేస్తాయి. యాలకులలోని (Elaichi Benefits)యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి. ఇది కాకుండా, యాలకులు బరువు తగ్గడం (Weight loss) నుండి దీర్ఘకాలిక వ్యాధుల వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను (Health Benefits) కలిగి ఉన్నాయి. యాలకులు వాడకం ఆహార రుచిని పెంచడమే కాకుండా…ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు చేస్తుంది.
మౌత్ ఫ్రెషనర్:
యాలాకులను చాలా మంది మౌత్ ఫ్రెషనర్‌గా కూడా ఉపయోగిస్తారు. రోజు రెండు యాలకులను నమిలి తింటే నోటిదుర్వాసన పోయి… శ్వాసను తాజాగా ఉంచుతుంది. కావిటీస్ రాకుండా చూస్తుంది.
అధిక రక్తపోటులో యాలకుల ప్రయోజనాలు:
అధిక రక్తపోటు అనేది రక్త నాళాలలో ఒత్తిడి పెరిగే పరిస్థితి. ఈ పెరుగుదల అనేక కారణాల వల్ల కావచ్చు. అధిక కొలెస్ట్రాల్ నుండి అధిక బరువు, ధూమపానం వరకు దీనికి అనేక ఇతర కారణాలు ఉండవచ్చు. అయినప్పటికీ, అధిక బిపి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ సందర్భంలో, రక్తపోటును నియంత్రించడంలో యాలకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
Read Also : ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ఎన్ని లాభాలో తెలుస్తే షాక్ అవుతారు..!!
1. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బీపీ పేషెంట్లు ఎంతగానో సహాకరిస్తాయి. యాలకులను నిత్యం ఆహారం రూపంలో తీసుకున్నట్లయితే బీపీ కంట్రోల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
2. యాలకులు ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
3. యాలకులు మూత్రవిసర్జన గుణాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు సోడియం, పొటాషియంను బయటకు పంపుతుంది.
4. యాలకులు తినేటప్పుడు, మీరు దాని పరిమాణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కూరలు లేదా స్వీట్లకు పరిమిత మొత్తంలో యాలకులను తీసుకోవాలి. మౌత్ ఫ్రెషనర్‌గా కూడా దీన్ని తక్కువ పరిమాణంలోనే ఉపయోగించండి.
Read Also : బరువు తగ్గాలంటే ఈ యోగాసనాలు వేయాల్సిందే..!!
చర్మ నిగారింపు కోసం:
చర్మం మెరిసిపోవాలని చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. దీనికోసం యాలకులు ఎంతోగానో ఉపయోగపడతాయి. యాలకుల నూనెను ముఖానికి రాస్తే అది మచ్చలను తొలగించి ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. యాలకులను పొడి చేసి అందులో కొద్దిగా తేనె కలపాలి. ఆ తర్వాత ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లయ్ చేయాలి. కాసేపు ఉంచి…నీటితో శుభ్రం చేసుకోవాలి.
పెదవులు మృదుత్వం కోసం:
ఆరోగ్యపరంగానే కాదు..అందం పరంగానూ యాలకులు ఎంతో ఉపయోపడగాయి. పలు రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో యాలకులను ఉపయోగిస్తారు. యాలకులను గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. దానికి తేనె జోడించి పెదవులపై రుద్దండి. పావుగంట తర్వాత మంచినీటితో శుభ్రం చేసుకుంటే..పెదాలు మృదువుగా, అందంగా మారుతాయి.
శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది:
యాలకులను క్రమం తప్పకుండా ఆహారంలో జోడించుకుంటే..అవి శరీరం నుంచి ట్యాక్సిన్లు బయటకు పంపించడంలో సహాయపడతాయి. శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దీంతో మీ చర్మం క్లీన్ గా మారుతుంది.
(Disclaimer:ఈ కథనం ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగానే ఇవ్వబడింది. ఆర్టీవీ(RTV) దీన్ని ధృవీకరించలేదు, బాధ్యత వహించదు. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం)