Director Sandeep Reddy Vanga : పాన్ ఇండియా హీరో ప్రభాస్ లిస్ట్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘స్పిరిట్’. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు మూడు వందల కోట్ల పై బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను టి.సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. స్పిరిట్’కు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసినట్లు చెప్పిన ఆయన.. ప్రస్తుతం తన చేతిలో రెండు కీలక ప్రాజెక్ట్‌లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. ఆ సినిమాలకు సంబంధించిన ప్రణాళికలు పూర్తి అయినట్లు.. వచ్చే నాలుగేళ్లు తన పూర్తి షెడ్యూల్ ఈ రెండు ప్రాజెక్ట్‌లకే సరిపోతుందని అన్నారు.
Also Read : ఆ సినిమా ప్లాప్ కు నేనే కారణం.. ఆమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే ‘స్పిరిట్’ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, సినిమా విడుదలకు మాత్రం రెండేళ్లు పట్టవచ్చని అన్నాడు. 2026లో ‘స్పిరిట్’ రిలీజ్ కానుందని రివీల్ చేశాడు. ప్రస్తుతం సందీప్ వంగా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమాలో సౌత్ క్వీన్ త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.