Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రయాణికులకు కీలక సూచన చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ రోడ్ షో లో పాల్గొననున్న విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా 2 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
🚨 Important Update, Hyderabad! 🚨
For security reasons, in light of PM Shri Narendra Modi’s Roadshow today (27/11/2023), Chikkadpally and Narayanaguda stations will be closed 15 minutes before and after the event, tentatively from 16:30 to 18:30 hrs.
Arm-B of RTC X Roads… pic.twitter.com/3dps74NQvC— L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 27, 2023
ఈ మేరకు ప్రధానమంత్రి మోదీ రోడ్ షో నేపథ్యంలో భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ప్రారంభమై నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు జరిగే రోడ్‌షోలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు ప్రధాని పర్యటను 15 నిమిషాల ముందు ఆ తర్వాత 15 నిమిషాలు కూడా మెట్రో స్టేషన్లు బంద్ చేయనున్నట్లు తెలిపారు. ఆ సమయంలో చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లలో స్టాప్‌లు ఉండవని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
Also read : నేను పవన్ అభిమానినే.. కానీ అలాంటి సినిమాలు చేయలేను: నితిన్
ఇదిలావుంటే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద గల వీర్ సావర్కర్ విగ్రహం వరకు ప్రధాని మోదీ ఎన్నికల రోడ్ షో కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. నేడు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. RTC క్రాస్ రోడ్స్ వైపు నుంచి నారాయణగూడ YMCA వైపు వెళ్లే వాహనాలను వీఎస్టీ, బాగ్ లింగంపల్లి, క్రౌన్ కేఫ్ మీదుగా, హిమాయత్ నగర్ నుంచి నారాయణ గూడ క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, సెమెటరీ, రామ్‌కోఠి మీదుగా డైవర్ట్ చేస్తున్నారు. ముషీరాబాద్ నుంచి RTC క్రాస్ రోడ్స్ వైపు వెళ్లే వాహనాలను రామ్‌నగర్ సాగర్‌లాల్ ఆసుపత్రి మీదుగా, హిందీ మహా విద్యాలయా నుంచి RTC క్రాస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను ఆజామాబాద్ క్రాస్ రోడ్స్ మీదుగా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కట్టమైసమ్మ లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా మళ్లించారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, లిబర్టీ, హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా నారాయణ గూడ క్రాస్ రోడ్స్‌కు వచ్చే వెహికల్స్‌ను అశోక్ నగర్ మీదుగా మళ్లించారు. నారాయణ గూడ సెమెటరీ మీదుగా వచ్చే వాహనాలను రామ్ కోఠి క్రాస్ రోడ్స్, భవన్స్ కాలేజీ లేన్ మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపారు. మోదీ రోడ్ షో ముగియగానే మళ్లీ యదావిధిగా రోడ్లు ఓపెన్ చేస్తామన్నారు.