తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల్లో సత్తా చాటి.. మెయిన్స్‌కు సిద్ధమవుతున్న 135 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాళ్లకు సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో 21 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు ఉన్నాయి. అలాగే 62 మంది ఓబీసీ, 19 మంది ఎస్సీ, 33 మంది ఎస్టీ కేటగిరీకి చెందినట్లుగా ప్రభుత్వం తెలిపింది.
Civils
UPSC: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్.. ఎక్కడంటే
సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు ప్రతిరోజూ గంటల తరబడి చదవాల్సి ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాలంటే సొంతంగా ప్రిపేర్ అవ్వడం కంటే కోచింగ్ తీసుకోవడం మంచిదని చాలామంది చెబుతుంటారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో చూస్తే లక్షల్లో ఫీజులు ఉంటాయి. కోచింగ్ తీసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి కుటుంబాల వాళ్లకి ఇది చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఉచితంగా హాస్టల్ వసతితో కూడిన కోచింగ్ ఇస్తోంది.
Also Read: నీతి ఆయోగ్ సమావేశం నుంచి సీఎం మమతా బెనర్జీ వాకౌట్
ప్రతి ఏడాది 100 అడ్మిషన్లను తీసుకుంటారు. బెస్ట్ ఫ్యాకల్టీని ఇక్కడ బోధిస్తారు. స్టడీ హాల్, లైబ్రరీ, ఫ్రీగా బుక్స్ కూడా ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 17 నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. జులై 31 చివరి తేది. వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండి, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు అర్హులు. బంజారాహిల్స్‌లో ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్లో 10 నెలల పాటు ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. ఉచింతంగానే హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. tsstudycircle.co.inలో పూర్తి వివరాలు ఉంటాయి. ఆ వెబ్ సైట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
Also read: అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నిపథ్ ను రద్దుచేస్తాం..అఖిలేష్ యాదవ్!
అయితే ఇక్కడ కోచింగ్ తీసుకోవాలంటే ముందుగా ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులను బట్టి ఎంపిక చేస్తారు. ఆగస్టు 11న ఉదయం 10.30 నుంచి 1.30 మధ్యలో ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష యూపీఎస్సీ ప్రీలిమ్స్ తరహాలో ఉంటుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఎంట్రన్స్ టెస్టులో వచ్చిన మార్కులను బట్టి రిజర్వేషన్ ప్రకారం కోచింగ్ సీట్లు కేటాయిస్తారు.
పరీక్ష విధానం..
పార్ట్ A లో 100 ఆబ్జెటీవ్ టైప్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు.
పార్ట్ B లో (C SAT) 40 ఆబ్జెటీవ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 1/2 మార్కులు.
రెండు పేపర్లలో 1/3 నెగిటివ్ మార్కులు ఉంటాయి. మొత్తం ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు.
TG Jobs Free Coaching: తెలంగాణ నిరుద్యోగులకు ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి!
Free Civils Coaching : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ భారీ ఊరట కలిగించే వార్త చెప్పింది. గిరిజన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అర్హులైన అభ్యర్థులకు సివిల్స్-2025 కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు. ఆసక్తిగల అభ్యర్థులు స్టడీ సర్కిల్ (Study Circle) వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో జూన్13 నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఈ అభ్యర్థులంతా అనర్హులే..
అలాగే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉండాలని చెప్పారు. డిగ్రీ పూర్తిచేసి సీశాట్-2025 పరీక్షకు అర్హత సాధించి ఉండాలని, ఉద్యోగాలు చేస్తున్న, ఇతర కోచింగ్ సంస్థల్లో శిక్షణ పొందుతున్న, ఇప్పటికే ప్రభుత్వ సహకారంతో శిక్షణ తీసుకున్న అభ్యర్థులను అనర్హులుగా పేర్కొన్నారు. అభ్యర్థులందరికీ పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని గిరిజన స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ అందిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు 62817 66534 ఫోన్ నంబరులో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదించాలని తెలిపారు.
దరఖాస్తు గడువు :
– జూన్ 13 నుంచి 30 లోపు కలదు.
– ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు :
విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాదించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలు మించకూడదు.
వయోపరిమితి :
21 ఏళ్ళు నిండి ఉండాలి
ఎంపిక విధానం:
ఆబ్జెక్టివ్ విధానంలో ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపికను చేపట్టనున్నారు.
సౌకర్యాలు:
ఉచిత వసతి, భోజనం.
8,000/- రూపాయల విలువ చేసే పుస్తకాల పంపిణీ.
లైబ్రరీ సౌకర్యం కలదు.
కంప్యూటర్ ల్యాబ్ లు కలవు.
నెలకు పాకెట్ మనీ 750/ (బాయ్స్), 1,000/- (గర్ల్స్) ఇవ్వబడును.
అప్లికేషన్ లింక్ : https://studycircle.cgg.gov.in/TSTWUPSCReg2425.do
Success Story : అవమానం సివిల్స్ ర్యాంక్ సాధించేలా చేసింది..ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఇదే.!
UPSC Civils Ranker Uday Krishna Reddy Success Story : అవమానం కొంతమందిని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది. అవమానించారని లోలోపల కుంగిపోకుండా పట్టుదలతో సివిల్స్ సాధించాడు. సీఐ అవమానించాడని కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ లో 780వ ర్యాంకు సాధించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. 2012లోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యాడు. 2019 వర్కు ఉద్యోగం చేశాడు. కానీ తోటి ఉద్యోగుల ముందు ఓ సీఐ తీవ్రంగా అవమానించడాన్ని తట్టుకోలేకపోయాడు. దీన్ని ఛాలెంజ్ తీసుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి..కీలక నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. మూడు ప్రయత్నాల్లో విఫలం అయ్యాడు. అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాలుగు ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించాడు. 2023 ఫలితాల్లో 780 వ ర్యాంకు సాధించాడు.
ఉదయ్ నేపథ్యం:
ఉదయ్ కృష్ణారెడ్డిది ఏపీలోని ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామం. చిన్నతనంలో తల్లిదండ్రులు దూరమయ్యారు. నానమ్మ దగ్గర పెరిగాడు. ఈ క్రమంలోనే 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాధించాడు. 7ఏండ్లు సర్వీస్ తర్వాత రాజీనామా చేశాడు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాడు. నాలుగో ప్రయత్నంలో ర్యాంకు సాధించిన తనను అవమానించిన వారి ముందు సగర్వంగా తలెత్తుకుని నిల్చున్నాడు.
60 మంది పోలీసులు ముందు ఓ సీఐ దారుణంగా అవమానించాడు. వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెంటనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యాను మూడు సార్లు రాశాను. నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను అంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చాడు. సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంకు సాధించిన అతను ఐఏఎస్ కేడర్ కాకుండా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తన ప్రిపరేషన్ ఆపే ప్రసక్తే లేదంటున్నారు. ఐఏఎస్ కేడర్ కు సెలక్ట్ అవ్వడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
ఇది కూడా చదవండి: అమెరికాలో భారతీయుడిపై రూ.2 కోట్ల రివార్డు.. భార్యను కృరంగా చంపి ఏం చేశాడంటే?
UPSC: సివిల్స్ అభ్యర్థుల ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్..జనవరి 2 నుంచి..!!
UPSC Civil Services Interview Schedule 2023: ప్రతిష్టాత్మకమైన సివిల్ సిర్వీసెస్ 2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు వ్యక్తిగత ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ (UPSC) ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈమధ్యే మెయిన్ పరీక్షల ఫలితాలను రిలీజ్ చేసిన యూపీఎస్సీ…తాజాగా ఇంటర్వ్యూల షెడ్యూల్ ను ప్రకటించింది. అభ్యర్థుల రోల్ నెంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో కూడిన ప్రత్యేక షెడ్యూల్ ను రూపొందించింది.
కాగా సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు మొత్తం 2,844మంది అర్హత సాధించారు. అందులో తొలుత 1026మంది అభ్యర్థులకు సంబంధించిన ఇంటర్య్వూ షెడ్యూల్ ను యూపీఎస్సీ రిలీజ్ చేసింది. మిగతా అభ్యర్థుల షెడ్యూల్ ను తర్వాత విడుదల చేయనున్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఇంటర్వ్యూలకు సంబంధించి 1026 మంది అభ్యర్థులు తొందరలోనే ఈ కాల్ లెటర్స్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పులు చేయాలన్న అభ్యర్థులు ఎట్టిపరిస్థితిలోనూ స్వీకరించబోమని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా సంబంధిత ఖర్చులకు రీయింబర్స్ చేస్తామని పేర్కొంది. అయితే రైళ్లలో సెకండ్, స్లీపర్ తరగతుల ప్రయాణానికి మాత్రమే డబ్బులు చెల్లించనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది.
గత మే నెలలో సివిల్స్ ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు సుమారు 5లక్షల మంది హాజరయ్యారు. అందులో 14,624మంది ప్రధాన పరీక్షకు అర్హత సాధించారు. సెప్టెంబర్ 15 నుంచి 24వ తేదీ వరకు మెయిన్ పరీక్షలను నిర్వహించారు. ఆ ఫలితాలు డిసెంబర్ 8న రిలీజ్ చేసిన యూపీఎస్సీ తాజాగా ఇంటర్వ్యూలకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 90 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించినట్లుగా సమాచారం.
అటు యూపీఎస్సీ ఇంటర్వ్యూకి అర్హత సాధించిన అభ్యర్థులు…ఇంటర్వ్యూ తేదీలను యూపీఎస్సీ అధికారిక upsc.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
– upsc.gov.in. వెబ్ సైట్ హోం పేజీలో కనిపించే UPSC Civil Services 2023 interview schedule లింక్ పై క్లిక్ చేయండి.
-ఇప్పడు కొత్త పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
-దానిలో మీ పేరు, రోల్ నంబర్ సహాయంతో మీ ఇంటర్వ్యూ తేదీని, సెషన్ టైమ్ ను చూడండి.
-భవిష్యత్ అవసరాల కోసం ఆ వివరాలున్న పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.
-దానితోపాటు ఒక హార్డ్ కాపీని తీసుకుని భద్రపర్చుకోండి.
ఇది కూడా చదవండి: రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు
Free Civils Coaching: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే
Free Civils Coaching in OU: సివిల్స్ లక్ష్యంగా ముందుకెళ్తున్న అభ్యర్థులకు ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సీటీ (Osmania University) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. దేశంలోనే అత్యున్నత హోదా కలిగిన సివిల్స్ ఉద్యోగం కోసం కష్టపడుతున్న విద్యావంతులకు తనవంతూ చేయూతనిచ్చేందుకు ముందడుగు వేసింది. ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ ల్లో లక్షల్లో ఫీజులు కడుతూ అపసోపాలు పడుతున్న యువతకు ఊరట కలిగించడంతోపాటు మరింత నాణ్యమైన సబ్జెక్ట్ అందించేందుకు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలుగు నెలలపాటు సివిల్స్ శిక్షణను (Civils Coaching) పూర్తి ఉచితంగా అందిచబోతున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనే ఆసక్తిగల క్యాండెట్స్ నుంచి ధరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో పీహెచ్ డీ స్టూడెంట్స్, క్యాంపస్ కాలేజీలకు అవకాశం ఇచ్చింది. సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కాలేజీ, నిజాం కాలేజీల్లో డిగ్రీ ఫస్ట్, సెకండ్ ఇయర్ MA, M.com, M.sc చదివే విర్థులతోపాటు MTech, MBA, LLM వంటి ఇతర పీజీ కోర్సులు చదివే వారికి కూడా అవకాశం కల్పించింది. ఈ సివిల్ సర్వీస్ అకాడమీలో 100 సీట్లు ఉన్నట్లు అధికారికంగా తెలిపిన డైరెక్టర్ డాక్టర్ కొంగ నాగేశ్వరరావు.. ఆసక్తి ఉన్న అభ్యర్థులంతా డిసెంబర్ 2 వరకూ అప్లై చేసుకోవాలని తెలిపారు.
Also read :నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో SBIలో 8773 జాబ్స్.. నేటినుంచే ధరఖాస్తులు
అలాగే ఇందులో సీటు సాధించిన అభ్యర్థులకు మే 1 వరకూ ట్రైనింగ్ ఇవ్వనుండగా ఎంపిక విధానానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించారు. డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రెన్స్ లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రిజర్వేషన్ ప్రతిపాదికన అభ్యర్థులను సెలెక్ట్ చేస్తామని, పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ గొప్ప అవకాశం గ్రూప్1,2 కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడనుంది. ఓయూ కల్పిస్తున్న ఈ అవకాశంపై నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ :
1. కాలేజీ ప్రిన్సిపాల్ జారీ చేసిన 2023-2024 విద్యా సంవత్సరం బోనాఫైడ్ సర్టిఫికేట్
2. SSC మార్కుల మెమో
3. డిగ్రీ మార్కుల మెమో
4. ఆధార్ కార్డ్
5. కుల ధృవీకరణ పత్రం
6. ఆదాయ ధృవీకరణ పత్రం
7. మూడు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
8.PG ప్రవేశ పరీక్ష ర్యాంక్ కార్డ్
గమనిక:
ఆసక్తిగల విద్యార్థులు 2023 డిసెంబర్ 2 వరకూ ఓయూలోని సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్‌ను నేరుగా అందజేయవచ్చు.