ఒక ఐఏఎస్ అధికారికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఈ ఉద్యోగం సాధించేందుకు చాలామంది విద్యార్థులు పోటీ పడుతుంటారు. లక్ష్య చేధన కోసం పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు చాలామంది మహానగరాలకు వెళ్లి లక్షలు పెట్టి కోచింగ్‌లు తీసుకుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు ఇంటి యజమానులు అద్దెలు ఇష్టం వచ్చినట్లు పెంచేస్తున్నారు. అయితే తాజాగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి గదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also read: విద్యుత్ స్కామ్‌పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
10 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ఒక గదిలో ఓ విద్యార్థి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అందులో ఒక కుర్చీ, టెబుల్, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. నడిచేందుకు కాస్త స్థలం మాత్రమే ఉంది. కనీసం దుస్తులు ఆరబెట్టుకునేందుకు కూడా స్థలం లేదు. ఇలాంటి చిన్న గదికి ఆ ఇంటి యజమానులు ఏకంగా రూ.12 నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ప్రతిఏడాది అద్దె పెంచుతూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను డీఎస్పీ అంజలి కటారీయా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
आप दिल्ली में 10×10 फुट कमरे का ₹12-15 हज़ार किराया भरते हैं, जहां मकान मालिकों का कार्टेल किराया बढ़ाए रखता है। और फिर वहां पढ़ते रूम पर बैठकर ऑनलाइन वीडियो से ही हैं!
केवल घर से दूर जाने भर के लिए दिल्ली मत जाइए और घरवालों के पैसे मत बर्बाद करिए#RajendraNagar #UPSCaspirants pic.twitter.com/79L76J9L6H
— Anjali Kataria, DSP 🇮🇳 (@AnjaliKataria19) July 28, 2024
‘ఢిల్లీలో 10X10 చిన్న గదికి స్టూడెంట్స్ రూ.10 నుంచి 15 వేలు చెల్లిస్తున్నారు. మీ కుటుంబ డబ్బును వృథా చేయకండి. ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యేందుకే విద్యార్థులు ఇంత మొత్తం చెల్లిస్తున్నారు. ఇది ఆలోచించాల్సిన విషయం అని’ ఆమె పోస్టు చేశారు. ఇదిలాఉండగా.. ఇటీవల ఢిల్లీలోని ఓల్డ్ రాజెందర్ నగర్లో రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. దీనిపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్ యజమానిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల సమస్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
Also Read: హల్వా వేడుక కామెంట్స్‌పై తలపట్టుకున్న నిర్మలా.. ఫొటోలు వైరల్