Monkey Pox Virus : ఆఫ్రికా(Africa) లోని కాంగో(Congo) లో మంకీ పాక్స్(Monkey Pox) విజృంభిస్తోంది. అక్కడ ఈ వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే(WHO) ప్రకటించింది. గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. అక్టోబర్‌లో మొదలైన ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ముఖ్యంగా సెక్స్ సంబధాల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోంది. దాంతో పాటూ ఈ వైరస్ కొత్త రూపం ప్రజల్లో మరింత వ్యాప్తి చెందుతుందని ఆఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాలుగు నెల్లో మొత్తం 4500 కేసులునమోదయితే అందులో ముడు వందల మంది ఇప్పటి దాకా చనిపోయారు. వీరందరికీ సెక్సువల్ సంబంధాల ద్వారానాఏ మంకీ పాక్స్ వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో కాంగోలో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పొరుగున ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా కేసులు నమోదు అవుతున్నాయి.
కొత్త వేరియంట్..
మంకీ పాక్స్ వ్యాధి ముఖ్య లక్షణం కాళ్ళు, చేతుల మీద దద్దుర్లు , కురుపులురావడం. ఆ తర్వాత జర్వం లాంటివి వచ్చి మనిషి ప్రాణాలను తీస్తుంది. ఇప్పుడు ఈ లక్షణాలు జననేంద్రియాల మీద కూడా కనిపిస్తున్నాయి. ఇది సెక్స్ ద్వారానే సాధ్యమని అంటున్నారు డాక్టర్లు. దీనిని కొత్త వేరియంట్‌గా అభివర్ణిస్తున్నారు. కొత్త వేరియంట్ వైరస్ ప్రజల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎమోరీ యూనివర్శిటీలోని అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ బోఘుమా టైటాంజీ స్పష్టం చేశారు. మంకీ పాక్స్‌కు వ్యాక్సిన్ లేకపోవడం వల్లనే…ఆ వైరస్ తొందరగా వ్యాప్తిస్తోందని చెప్పారు.
ఇండియాలో కూడా..
భారతదేశం(India) లో కూడా మంకీ పాక్స్ కేసులునమోదయ్యాయి. కరోనా తర్వాత ఈ వైరస్ కూడా కొన్నాళ్ళు భయపెట్టింది. దీనివల్ల ఒక వ్యక్తి కూడా మరణించారు. 22 ఏళ్ళ ఆ వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు మంకీ పాక్స్ వైరస్ సోకిందని… కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ చెప్పారు.
మంకీ పాక్స్ అంటే ఏమిటి?
మంకీ పాక్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది. ఇది వైరల్ జూనోటిక్ ఇన్ఫెక్షన్. ఇది స్మాల్ పాక్స్‌కి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చింది. ఇది వస్తే జ్వరం, తల నొప్పి, బ్యాక్ పెయిన్, కురుపులు వంటి లక్షణాలు కనపడతాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఇప్పుడు ఇది సెక్స్ వల్ల కూడా వ్యాప్తి చెందుతోంది. క్లోజ్ పర్సనల్, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కలిగినప్పుడు మంకీ పాక్స్ కనుక ఉన్నట్లయితే అది మరొకరికి కూడా సోకుతుంది. అలాగే మంకీ పాక్స్ వైరస్ ది ఓరల్, ఆనల్ సెక్స్, వాజీనల్ సెక్స్ వలన కూడా ఇది స్ప్రెడ్ అవుతోంది. ఇంతకు ముందు సెక్స్ వల్ల ఈ వైరస్ సోకిన కేసులు లేవు కానీ…ఇప్పుడు కాంగోలో మాత్రం కేవలం దానివల్లనే వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.