Telangana RTC: తెలంగాణలో కురుస్తునన భారీ వర్షాల వల్ల హైదరాబాద్-విజయవాడ మార్గంలో చాలా చట్ల జాతీయ రహదారి పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ 560 కి పైగా బస్సులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దైన బస్సుల్లో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా ఉన్నాయి.
cancelled
South Central Railway: 94 రైళ్లు రద్దు..41 రూట్ మార్పు!
South Central Railway: సెప్టెంబర్ నాలుగో వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనున్నట్లు అధికారులు తెలిపారు. 94 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించడమే ఇందుకు కారణం. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేటెఫ్ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల మార్గాన్ని, నాలుగు లైన్లుగా అందుబాటులోకి తీసుకుని వచ్చే పనుల నేపథ్యంలోనే రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇందులో కొన్ని రైళ్లు కనిష్ఠంగా ఓ రోజు, గరిష్ఠంగా 15 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని తెలిపారు. 41 రైళ్లను దారి మళ్లించి నడుపుతారు. మరో 27 రైళ్ల ప్రయాణ వేళలను మార్చారు. రద్దయిన వాటిలో గోల్కొండ, శాతావాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్ సిటీ వంటి రైళ్లు ఈ లిస్ట్ లో ఉన్నాయి.
మరికొన్ని సౌత్ స్టేట్స్ నుంచి తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించేంది కూడా ఉన్నాయి. కాజీపే- సిర్పూర్ టౌన్—సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 7 వరకు, సిర్పూర్ టౌన్- కాజీపేట రైలు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 8 వరకు రద్దు చేశారు.
భద్రాచలం రోడ్- బళ్లార్ష , బళ్లార్ష- కాజీపేట సెప్టెంబర్ 29- అక్టోబర్ 8 వరకు రద్దు చేసినట్లు అధికారులు వివరించారు. సికింద్రాబాద్-సిర్పుర్ కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు రద్దయ్యాయి.
గుంటూరు-సికింద్రాబాద్ , సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు-సికింద్రాబాద్ , సికింద్రాబాద్- గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు రద్దయ్యాయి.
విజయవాడ-సికింద్రాబాద్,సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వరకు రద్దయ్యాయి.
Also Read: జన్వాడ ఫాంహౌస్‌కు పర్మిషన్ లేదు.. అధికారుల సంచలన ప్రకటన
Trains Cancelled: మూడు రోజుల పాటు ఆ స్పెషల్ రైళ్లు రద్దు!
Trains Cancelled: గత కొంతకాలంగా రైల్వేశాఖకు సంబంధించిన కొన్ని వార్తలు భయాందోళను గురి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ల నిర్మాణాల కారణంగా ఆయా ప్రాంతాల నుంచి వెళ్లే రైళ్లను దారి మళ్లించడంతోపాటు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ముఖ్యమైన అప్డేట్లను ఇస్తుంది.
ఈ క్రమంలో పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ మూడు రోజుల పాటు పలు మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈరోజు నుంచి అంటే ఆగస్టు 17 నుంచి 19 వరకు తిరుపతి-కాచిగూడ, కాకినాడ టౌన్-సికింద్రాబాద్- -కాకినాడ టౌన్, నర్సాపూర్- -సికింద్రాబాద్- -నర్సాపూర్ రైళ్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ పేర్కొంది.
సాంకేతిక సమస్యల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. లేదంటే ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రావాల్సి ఉంది.
Flights Cancelled: దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దు..ఎందుకో తెలుసా!
Flight Cancelled: మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సర్వర్లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది భారత విమానయాన సేవలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్ మరియు స్పైస్‌జెట్‌తో సహా పలు విమానయాన సంస్థలు వివిధ సాంకేతిక లోపాలను ఎదుర్కొన్నాయి. స్లో చెక్-ఇన్లు, విమానాశ్రయాలు, సంప్రదింపు కేంద్రాల వద్ద భారీ క్యూలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్.. ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ వ్యవస్థలో తలెత్తిన అంతరాయం కారణంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. ఫ్లైట్ రీబుక్ లేదా రీఫండ్‌ను క్లెయిమ్ చేసే ఆప్షన్ కూడా తాత్కాలికంగా అందుబాటులో లేదని పేర్కొంది. రద్దయిన విమానాల వివరాలను తెలుసుకునేందుకు https//bit.ly/4d5dUcZ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నుంచి సుమారు 192 విమానాలు రద్దయ్యాయి.
కాగా.. మైక్రోసాఫ్ట్ వినియోగదారులు Microsoft 360, Microsoft Windows, Microsoft Team, Microsoft Azure, Microsoft Store, Microsoft క్లౌడ్-ఆధారిత సేవలను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. 74 శాతం మంది వినియోగదారులు మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోకి లాగిన్ అవ్వడంలోనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో 36 శాతం మంది ప్రజలు యాప్‌ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంపెనీకి సంబంధించిన ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
Also read: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. బిలియన్ల డాలర్లు నష్టం
Trains Cancelled: వందేభారత్ తో పాటు 22 రైళ్లు రద్దు!
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు పెద్ద షాక్ తగిలింది. భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది.భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే ప్రకటించింది. గురువారం నుంచి రూర్కీ రైల్వే స్టేషన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. రద్దు చేసిన రైళ్లలో వందేభారత్ తో సహా 22 రైళ్లను రద్దు చేయగా, దాదాపు 18 రైళ్ల రూట్ ను మార్చేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దీని ప్రభావం హరిద్వార్, రిషికేశ్ ప్రయాణికులపై ఎక్కువగా పడబోతోంది. రూర్కీ రైల్వే స్టేషన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ఏడు రోజుల పాటు కొనసాగుతాయి. అంటే వారం రోజుల పాటు రైలు సేవలు ప్రభావితం కానున్నాయి.
ఉత్తరాఖండ్ లోని రూర్కీలో యార్డ్ పునఃనిర్మాణం జరుగుతోంది. దీనిలో నాలుగు రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ ముందు పని జరుగుతుంది. దీని తరువాత, జాతీయ దర్యాప్తు సంస్థ పని మూడు రోజులు జరుగుతుంది. ఈ పనులు జూన్ 27 నుంచి ప్రారంభమై జులై 3 నాటికి పూర్తవుతాయి.
ఇక్కడ నుంచి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు జులై 1 నుంచి 3 వరకు రద్దు అవుతాయని అధికారులు వివరించారు. కొన్ని రైళ్లను ఏడు రోజులు, మరికొన్ని మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also read: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..డ్రైవర్ తో పాటు ఇద్దరు మృతి!
Hyderabad: నగర వాసులకు అలర్ట్..ఈ రూట్లలో రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు!
Hyderabad MMTS Trains Cancelled: హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైళ్ల లో ప్రయాణించేవారికి ఓ ముఖ్య గమనిక.. ఈ నెల 25, 26 తేదీల్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపథ్యంలో , ఫుట్ ఓవర్ బ్రిడ్జిల లాంటి నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.
Also Read : మిథాలీ రాజ్‌తో పెళ్లి.. శిఖర్ ధావన్ ఏమన్నారంటే!
సికింద్రాబాద్ – ఫలక్‌నుమా, మేడ్చల్ – సికింద్రాబాద్, లింగంపల్లి – మేడ్చల్, హైదరాబాద్ – మేడ్చల్ మధ్య సేవలందించే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్. రాకేశ్ ఓ ప్రకటనలో వివరించారు. ఇక వీటితో పాటు సిద్దిపేట – సికింద్రాబాద్ ల మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో కొన్ని రైళ్లను కేవలం రెండు రోజుల పాటు, మరికొన్నింటిని ఒక్కరోజు మాత్రమే సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఆయన వివరించారు.