Bharat Bandh : ఈ నెల 21న భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య, కో- కన్వీనర్ చెన్నయ్య అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్లుండి జరిగే బంద్ ఎస్సీ, ఎస్టీ సంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళలు పాల్గొనాలని తెలిపారు.
వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్…
ఆగస్టు 1న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు (Supreme Court) సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమర్థనీయమని తెలిపింది. ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని.. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకర అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ (Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది.
Also Read : నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన