Acinetobacter baylyi : క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కసారి క్యాన్సర్ సోకిదంటే దాని నుంచి కోలుకోలేము. కానీ మెడిసిన్ ద్వారా కొన్ని నెలలు, లేదంటే కొన్ని సంవత్సరాలు జీవించవచ్చు. అయితే ఇటీవల శాస్త్రవేత్త ప్రేగు క్యాన్సర్ చికిత్స కోసం కొత్త రకం బ్యాక్టీరియాను సృష్టించారు. ఈ బ్యాక్టీరియా పేరు ఎసినెటోబాక్టర్ బైలేయిగా (Acinetobacter baylyi) నామకరణం చేశారు. క్యాన్సర్ సమయంలో మానవ డీఎన్ఏలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకోవడానికి ఈ బ్యాక్టీరియాను ప్రేగులలో ఇంజనీరింగ్ చేస్తారు. ప్రస్తుతం ఇది కొలొరెక్టల్ క్యాన్సర్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంజినీరింగ్ చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
‘జర్నల్ సైన్స్’లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, క్యాన్సర్ పేగులో ఎక్కడైనా పెరుగుతుంది. అయితే దానిని గుర్తించడం చాలా కష్టం. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ చేయబడిన బ్యాక్టీరియా ద్వారా క్యాన్సర్ ను గుర్తించండి చాలా సులభం. ఏదైనా పేగు వ్యాధులను జాగ్రత్తగా పరిశీలించి, గుర్తించే విధంగా గట్‌లో ప్రోబయోటిక్ సెన్సార్‌గా పనిచేసే ఈ బ్యాక్టీరియాపై పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు. శాన్ డియాగోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో జీవశాస్త్రవేత్త రాబర్ట్ కూపర్ (Cooper) నేతృత్వంలోని బృందం అసినెటోబాక్టర్ బైలేయి అనే బ్యాక్టీరియాను విజయవంతంగా రూపొందించింది. ఈ బ్యాక్టీరియా, దాని పర్యావరణం నుండి డీఎన్ఏను (DNA) గ్రహించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. కొలొరెక్టల్ క్యాన్సర్‌లో సాధారణమైన నిర్దిష్ట డీఎన్ఏ సన్నివేశాల కోసం దీన్ని రూపొందించారు.
ఇది కణితి డీఎన్ఏని దాని వ్యవస్థలోకి చేర్చినప్పుడు, యాంటీబయాటిక్-రెసిస్టెన్స్ జన్యువు సక్రియం చేస్తుంది. ఈ జన్యువు మలం నుండి సేకరించిన యాంటీబయాటిక్స్ కలిగిన అగర్ ప్లేట్లపై బ్యాక్టీరియా పెరగడానికి అనుమతిస్తుంది. ఇది క్యాన్సర్ కణాల ఉనికిని సూచిస్తుంది. అయితే ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ పద్ధతిని క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.అంతేకాకుండా, ఇంజనీర్ చేయబడిన బ్యాక్టీరియా ప్రభావం, భద్రత ఇంకా పరీక్షా సమయంలోనే ఉంది. బ్యాక్టీరియా KRASని గుర్తించడానికి ప్రోగ్రామ్ రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది దాదాపు 40 శాతం కొలొరెక్టల్ క్యాన్సర్లు, కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్లు, చాలా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లలో ఉపయోగించనున్నట్లు తెలిపారు.
Also Read: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..!