యూపీలోని అయోధ్యలో ఎట్టకేలకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడంతో కోట్లాది మంది భక్తుల కల ఇన్నాళ్లకు సాకారమయ్యింది. భవ్యమందిరంలో బాలమందిరంలో కొలువుదీరాడు. సోమవారం మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రిడా రంగ ప్రముఖులు హజరయ్యారు. భద్రతా కారణాల వల్ల సామన్య పౌరులను దర్శనానికి రావొద్దని అధికారులు కోరారు.
అయితే రేపటినుంచి (మంగళవారం) నుంచి అందరూ బాలరాముడిని దర్శించుకోవచ్చు. అక్కడ దర్శనం, హారతి వేళలకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తమ వెబ్సైట్లో తెలిపింది. ఇక్కడున్న లింక్‌పై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
Also Read: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా..
దర్శనం వేళలు ఇలా
ఉదయం 7.00 AM నుంచి 11.30 AM వరకు
మధ్యాహ్నం 2.00 PM నుంచి రాత్రి 7.00 PM వరకు
జాగరణ హారతి: ఉదయం 6.30 AM గంటలకు ( దీనికి ఒకరోజు ముందుగా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది)
సంధ్యా హారతి: రాత్రి 7.30 PM గంటలకు ( అందుబాటును బట్టి అదే రోజు బుక్ చేసుకోనే సదుపాయం ఉంది)
ఇక మరో విషయం ఏంటంటే రాముడిని దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఒక గుర్తింపు కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. హారతి కార్యక్రమానికి ఉచితంగా పాస్ ఇవ్వనున్నారు. కాని అవి కొన్ని మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్, లేదా ఆలయం వద్ద పాస్ తీసుకున్న వాళ్లకే హారతి సమయంలో పర్మిషన్ ఉంటుంది. పేదళ్లలోపు పిల్లలకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది.
#WATCH | First visuals of the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya pic.twitter.com/E0VIhkWu4g
— ANI (@ANI) January 22, 2024
Also Read: రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. గుడిలోకి అనుమతించని ఆలయ కమిటీ