తమిళనాడులోని కుంభకోణం… వారసత్వ సంపదకు పెట్టింది పేరు. సంతానకృష్ణన్‌దీ అదే ప్రాంతం. చదివే రోజుల్లో అక్కడి వీధుల్లో నుంచి వెళుతుండేవాడు. ఇళ్ళ గుమ్మాలు, తలుపులు రంగు రంగుల్లో… కళ్ళలకు ఇంపుగా… ఎంతో కళగా కనిపించేవి. అవి అతడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. డిగ్రీ అయిపోయింది. చెన్నైలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళేముందు ప్రయోగాత్మకంగా తలుపుల పెయింటింగ్స్ గీయాలనుకున్నాడు కృష్ణన్. కుంభకోణంలో అతడు చూసిన చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు మినియేచర్లుగా మలిచాడు. అక్రాలిక్ పెయింటింగ్స్‌తో తుదిరూపు ఇచ్చాడు.
Also Read:తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం
గొప్ప కళాకారుల్లా ఈ రంగంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నా. దానికి థీమ్ ఏమిటని ఆలోచిస్తుండగా ఆ తలుపులు గుర్తుకువచ్చాయి. ఇక ఆలస్యం చేయలేదు అంటాడు కృష్ణన్. దాన్నే వృత్తిగా తీసుకున్న అతను కొన్నేళ్ళకు అందులో నిష్ణాతుడయ్యాడు. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తను మలిచిన ద్వారాలతో బోలెడు ప్రదర్శనలు ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ముఖద్వారాలకు ముఖచిత్రమయ్యాడు.
ఎక్కడకు వెళ్లినా… సంతానకృష్ణన్ కళాచిత్రాలకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఎవరు చూసినా ఫిదా కావల్సిందే. అంతలా ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాడు అతడు. దానికి కారణం ఏమిటని కృష్ణన్‌ను అడిగితే… ‘‘ఈ తలుపులు చూసిన ప్రతిఒక్కరూ నాతో చెప్పే మొదటి మాట… బాల్యంలో తమ ఇల్లు గుర్తుకు వచ్చిందని..! అలా నాటి జ్ఞాపకాలు ఒక్కసారి వారి కళ్ళ ముందు తిరుగుతున్నాయని. అలా తమ మూలాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ… మధురానుభూతి పొందుతున్నారు. బహుశా అందుకే నా చిత్రాలు అంతగా క్లిక్ అవుతున్నాయోమో అంటాడు.
కృష్ణన్ వేసిన పెయింటింగ్స్‌లో ఎన్టీఆర్, కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్, కరణ్‌జోహార్, సచిన్ టెండుల్కర్…ఇంకా చాలా మంది సెలబ్రిటీల ద్వారాలు కూడా ఉన్నాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్, చెన్నైలోని రెయిన్‌ట్రీ హోటల్స్‌కు వెళితే కృష్ణన్ కళకు అద్దంపట్టే తలుపులు ఆహ్వానం పలుకుతాయి.