Animal Actress Tripti Dimri Reacts On National Crush Tag : ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ నటి తృప్తి దిమ్రి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. యానిమల్ లో సైడ్ హీరోయిన్ గా నటించిన ఈమె మెయిన్ హీరోయిన్ కన్నా ఎక్కువ ఫేమ్ తెచ్చుకుంది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టి పడేసింది. దాంతో ఈ ముద్దుగుమ్మకి ఒక్కసారిగా భారీ పాపులారిటీ వచ్చేసింది. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటించిన రష్మికకి కూడా రాని గుర్తింపు యానిమల్ తో సొంతం చేసుకుంది తృప్తి.
ఇప్పుడు బాలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్ జరిగినా ఆమెనే పిలుస్తున్నారు. అంతేకాదు గత నెలలో గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సెలబ్రిటీస్ లో ఈమె కూడా ఒకరు.ఆ రేంజ్ లో త్రిప్తి యానిమల్ తో భారీ ఫేమ్ తెచ్చుకొని బాలీవుడ్ నేషనల్ క్రష్ గా మారింది. అటు సోషల్ మీడియాలోనూ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్ ను అభిమానులు ‘నేషనల్ క్రష్’ అని పిలవడంపై తాజాగా త్రిప్తి స్పందించారు.
Also Read : మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న సమంత.. దాని కోసమేనా?
ఆ ట్యాగ్ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. ” బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్ చేస్తానని కెరీర్ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, యాక్టింగ్‌ను నేను సీరియస్‌గా తీసుకోలేదు. మొదటి సినిమా పూర్తైన తర్వాత కెరీర్‌ను విధికే వదిలేశా. ఒక సినిమా పూర్తి చేశా. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు అనుకున్నా.
అలాంటి సమయంలో ‘లైలా మజ్ను’ కోసం ఆడిషన్లో పాల్గొన్నా. ఆనాటి నుంచి యాక్టింగ్‌పై దృష్టిపెట్టా. నటనలో శిక్షణ తీసుకొన్నా. ప్రేక్షకులు నా నటనతో కనెక్ట్ అవుతున్నారు. నేషనల్ క్రష్ అనేది నా దృష్టిలో ట్యాగ్ మాత్రమే కాదు. అభిమానుల ప్రేమ. వాళ్లు నన్ను అలా పిలుస్తున్నందుకు ఆనందంగా ఉన్నా. ఇది నాపై మరింత బాధ్యత పెంచింది. ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో నటించాలి” అని చెప్పుకొచ్చింది.