Anand Devarakonda Singing Video Going Viral : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తమ్ముడిగా టాలీవుడ్ (Tollywood) కి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda).. ‘బేబీ’ సినిమాతో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే ‘గం, గం గణేశా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన లోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టి ఆడియన్స్ ను అలరించాడు.
ఇక తాజాగా ఈ హీరో ఫ్యామిలీతో కలిసి అమెరికా (America) లో నిర్వహించిన ఓ ఈవెంట్ కి వెళ్ళాడు. ఈ ఈవెంట్లో పాట పాడి అదరగొట్టాడు. తన సూపర్ హిట్ సినిమా బేబీ నుంచి.. ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. అనే ఎమోషనల్ సాంగ్ ని పాడాడు. ఆనంద్ ఈ సాంగ్ ని అద్భుతంగా పాడటంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.
Also Read : మర్డర్ కేసులో ‘పోకిరి’ రీమేక్ హీరో అరెస్ట్..!
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆనంద్ దేవరకొండ చాలా బాగా పాడాడని, ఆనంద్ లో ఈ టాలెంట్ కూడా ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ అయితే నెక్స్ట్ మూవీలో ఆనంద్ దేవరకొండ ఓ సాంగ్ పడితే బాగుంటుందని అంటున్నారు.
A heartwarming rendition💖@ananddeverkonda sings the beautiful & magical melody #OoRenduPremaMeghalila from #Baby 😍#AnandDeverakonda #ATA pic.twitter.com/9Py6paUxyl
— GSK Media (@GskMedia_PR) June 11, 2024