Actress Kriti Sanon : సౌత్ నుంచి నార్త్ వరకు డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ స్టార్ ధనుష్.. ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అది కూడా బాలీవుడ్లో తనకు సాలిడ్ డెబ్యూ హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో హైట్రిక్ సినిమా చేస్తుండడం విశేషం. ‘రాంజనా’, ‘అత్రంగిరే’ వంటి హిట్స్ తర్వాత వీరి కాంబోలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘తేరే ఇష్క్ మే. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ ,మెంట్ వీడియో సినిమాపై ఆసక్తి పెంచింది.
మొదటి రెండు సినిమాల్లో సోనమ్ కపూర్, సారా అలీఖాన్ లతో రొమాన్స్ చేసిన ధనుష్.. ఈసారి ‘ఆదిపురుష్’ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ తో జత కట్టనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ, త్రిప్తి దిమ్రి పేర్లు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఇటీవలే మేకర్స్ హీరోయిన్ రోల్ కోసం కృతి సనన్ ను సంప్రదించగా.. అందుకు ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం.
Also Read : తారకరత్న భార్య బర్త్ డేని సెలెబ్రేట్ చేసిన YS షర్మిల.. వైరల్ అవుతున్న ఎమోషనల్ వీడియో..!
త్వరలోనే ఆమె పేరుని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. కృతి సనన్ ఇప్పటికే బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ధనుష్ తమిళంతో పాటు బాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరు స్టార్ల కలయికతో ‘తేరే ఇష్క్ మేయ్’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్టోబర్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.