Sivakarthikeyan’s Amaran Release Date Out : కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. రీసెంట్ గా ‘మహా వీరుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు ‘అమరన్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రాన్ని సీనియర్ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
కశ్మీర్లోని షాపియన్ బ్యాక్డ్రాప్లో ‘అమరన్’ చిత్రం తెరకెక్కినట్టు అర్థమవుతోంది. కశ్మీర్లోని మిలటరీ క్యాంప్స్ను, అక్కడి సైనికుల జీవితాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఇప్పటికే టీజర్ తో చెప్పేశారు. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించేందుకు శివ కార్తికేయన్ తన లుక్ మొత్తాన్ని చేంజ్ చేసుకున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
“There lived a man who never feigned to be a hero…”
Let’s celebrate our #Amaran – #MajorMukundVaradarajan this Diwali 🙏👍
A film by @Rajkumar_KP#AmaranDiwali@ikamalhaasan #Mahendran @anbariv @gvprakash @Sai_Pallavi92 @RKFI @SonyPicsIndia @sonypicsfilmsin @turmericmediaTM… pic.twitter.com/SmeInSTUJz
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) July 17, 2024
Also Read : ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో సత్తా చాటిన ‘బలగం’.. ఏకంగా అన్ని కేటగిరీల్లో నామినేట్..!
దీపావళికి…
‘హీరోగా కనిపించని వ్యక్తి.. మేజర్ ముకుంద్ వరదరాజన్ స్పూర్తితో ఈ దీపావళిని జరుపుకుందాం. అక్టోబర్ 31న ‘అమరన్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది’ అంటూ ట్వీట్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో శివకార్తికేయన్ రక్తపు మరకలతో కనిపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో జాతీయ జెండా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.